The Promises of God గురించి బైబిల్ వచనాలు: Plead in prayer
Plead in prayer గురించి వచనాలు
తర్వాత యాకోబు ప్రార్థిస్తూ, “నా తండ్రియైన అబ్రాహాము దేవా, నా తండ్రియైన ఇస్సాకు దేవా, ‘నీ దేశానికి, నీ బంధువుల దగ్గరకు వెళ్లు, నేను నిన్ను అభివృద్ధి చేస్తాను’ అని నాతో చెప్పిన యెహోవా,
కానీ మీరు, ‘నేను ఖచ్చితంగా నిన్ను వృద్ధి చేసి నీ సంతానాన్ని లెక్కించబడలేని సముద్రపు ఇసుక రేణువుల్లా చేస్తాను’ అని అన్నారు” అని ప్రార్థన చేశాడు.
“ఇప్పుడు యెహోవా, మీ సేవకుడనైన నా గురించి నా కుటుంబం గురించి మీరు చేసిన వాగ్దానం ఎల్లకాలం స్థిరపరచబడాలి. మీరు వాగ్దానం చేసినట్టు చేయండి,
యెహోవా, మీరే దేవుడు! మీ సేవకునికి ఈ మంచి విషయాలను వాగ్దానం చేశారు.
నాకు గతంలో జరిగింది గుర్తు చేయి మనం కలిసి వాదించుకుందాం; నిన్ను నీవు నీతిమంతునిగా రుజువు చేసుకో.