కంటెంట్‌కు వెళ్లండి

The Happiness of the Wicked గురించి బైబిల్ వచనాలు

24 వచనాలు · 25 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. హామాను ఆ రోజు మహానందంతో బయటకు వెళ్లాడు. కాని, రాజభవన ద్వారం దగ్గర ఉన్న మొర్దెకై తనను చూసి కూడా లేచి నిలబడలేదని తన ఎదుట ఎలాంటి భయం చూపించలేదని చూసి అతనికి మొర్దెకై మీద తీవ్రమైన కోపం వచ్చింది.

  2. అయినా హామాను తనను తాను నిగ్రహించుకొని ఇంటికి వెళ్లాడు. తన స్నేహితులను, తన భార్యయైన జెరెషును పిలిచి,

  3. హామాను గర్వంగా తనకున్న విస్తారమైన ఐశ్వర్యం గురించి, తనకున్న ఎంతోమంది కుమారుల గురించి, రాజు తనను ఎన్ని విధాలుగా ఘనపరిచాడో, ఎలా తనను ఇతర సంస్థానాధిపతుల ఎదుట గౌరవించాడో వారికి గొప్పగా చెప్పుకున్నాడు.

  4. Until I went into the sanctuary of God; then understood I their end.

  5. ఖచ్చితంగా మీరు వారిని జారే నేలపై ఉంచారు; మీరు వారిని పతనానికి పడవేస్తారు.

  6. వారు అకస్మాత్తుగా నాశనమవుతారు, వారు భయంతో పూర్తిగా నశిస్తారు!

  7. ప్రభువా, మీరు లేచినప్పుడు, ఒకరు మేల్కొన్నప్పుడు ఒక కలలో చూసినవి మరచినట్లు; మీరు వారి ఉనికిని తృణీకరిస్తారు.

  8. నేను సంతోష ధ్వనులను, వధూవరుల స్వరాలను, తిరుగటిరాళ్ల శబ్దాన్ని దీపపు వెలుగును వారి నుండి దూరం చేస్తాను.

  9. ఈ దేశమంతా నిర్జనమైన బంజరుగా మారుతుంది, ఈ దేశాలు డెబ్బై సంవత్సరాలు బబులోను రాజుకు సేవ చేస్తాయి.

  10. ఇంకా ఆయన వారికి ఈ ఉపమానం చెప్పారు: “ఒక ధనవంతుని పొలం సమృద్ధిగా పంట పండింది.

  11. అప్పుడు అతడు తనలో తాను అనుకున్నాడు, ‘నేను ఏమి చేయాలి? ఈ పంటంతటిని నిల్వ చేసుకోవడానికి నాకు స్ధలం చాలదు.’

  12. “అప్పుడతడు, ‘నేను ఇలా చేస్తాను. ఇప్పుడున్న కొట్లను పడగొట్టి, పెద్ద కొట్లను కట్టించి వాటిలో నా ధాన్యాన్ని సమకూర్చుకుంటాను.

  13. నా ఆత్మతో నేను ఇలా అనుకుంటాను, “అనేక సంవత్సరాలకు సరిపడినంత విస్తారమైన ధాన్యం నీకోసం సమకూర్చి ఉంచాను. జీవితాన్ని తేలికగా తీసుకో; తిను, త్రాగు, సంతోషంగా ఉండు” ’ అని అనుకున్నాడు.

  14. “కాని దేవుడు అతనితో, ‘ఓయీ బుద్ధిహీనుడా! ఈ రాత్రే నీ ప్రాణం పోతే, నీకోసం నీవు సిద్ధపరచుకొన్నది ఎవరిదవుతుంది?’

  15. “ఊదా రంగు సన్నని నారబట్టలను ధరించుకొని, ప్రతిరోజు విలాసంగా జీవించే ఒక ధనవంతుడు ఉండేవాడు.

  16. వాని ఇంటి వాకిటనే శరీరమంతా కురుపులు ఉన్న లాజరు అనే పేరుగల ఒక పేదవాడు ఉండేవాడు.

  17. వాడు ఆ ధనవంతుని బల్ల నుండి పడే రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకోవాలని చూసేవాడు. కుక్కలు వచ్చి వాని కురుపులను నాకేవి.

  18. “ఆ పేదవాడు చనిపోయినప్పుడు దేవదూతలు వానిని అబ్రాహాము రొమ్మున ఆనుకోడానికి తీసుకెళ్లారు. అలాగే ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడ్డాడు.

  19. ధనవంతుడు నరకంలో యాతనపడుతు, దూరం నుండి అబ్రాహాము రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూశాడు.

  20. వెంటనే అతడు, ‘తండ్రీ అబ్రాహామూ, నేను అగ్నిలో అల్లాడి పోతున్నాను. నా మీద కనికరం చూపించి, తన చేతివ్రేలికొన నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చడానికి లాజరును పంపించవా’ అని కేక వేశాడు.

  21. “అందుకు అబ్రాహాము, ‘కుమారుడా, జ్ఞాపకం చేసుకో, లాజరు కష్టాలను అనుభవిస్తున్నప్పుడు నీ జీవితంలో నీవు మేళ్ళను అనుభవించావు, కానీ ఇప్పుడు ఇక్కడ అతడు ఆదరణ పొందుతున్నాడు, కానీ నీవు యాతనపడుతున్నావు.

  22. నిర్ణయించబడిన రోజున హేరోదు, రాజ వస్త్రాలను ధరించుకొని, తన సింహాసనం మీద కూర్చుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాడు.

  23. అప్పుడు ప్రజలు, “ఇది మానవ స్వరం కాదు దేవుని స్వరమే!” అని కేకలు వేశారు.

  24. వెంటనే, హేరోదు దేవునికి ఘనత ఇవ్వని కారణంగా, ప్రభువు దూత అతన్ని కొట్టగా, అతడు పురుగులుపడి చనిపోయాడు.