కంటెంట్‌కు వెళ్లండి

The Amorites గురించి బైబిల్ వచనాలు: The Gibeonites a tribe of, deceived Israel into a league

14 వచనాలు · 29 కోణాలు

The Gibeonites a tribe of, deceived Israel into a league గురించి వచనాలు

  1. అయితే, యెరికోకు, హాయికి యెహోషువ ఏమి చేశాడో గిబియోను ప్రజలు విన్నప్పుడు,

  2. వారు ఒక కుయుక్తిని ఆలోచించి, రాయబారులుగా నటిస్తూ తమ గాడిదల మీద చినిగిపోయిన గోనెసంచులు, పాతగిల్లి అతుకు వేసిన ద్రాక్షతిత్తులను పెట్టుకుని వెళ్లారు.

  3. తమ కాళ్లకు అరిగిపోయి అతుకులు వేసిన పాత చెప్పులు, పాతబడిన బట్టలు వేసుకున్నారు. వారు తెచ్చుకున్న రొట్టెలన్నీ ఎండిపోయి బూజు పట్టి ఉన్నాయి.

  4. వారు గిల్గాలులో శిబిరం దగ్గర ఉన్న యెహోషువ దగ్గరకు వచ్చి అతనితో, ఇశ్రాయేలీయులతో, “మేము దూరదేశం నుండి వచ్చాం; మాతో ఒక సమాధాన ఒడంబడిక” అని అన్నారు.

  5. ఇశ్రాయేలీయులు హివ్వీయులతో, “కాని మీరు మా మధ్య నివసిస్తున్న వారిలా ఉన్నారు, మేము మీతో ఎలా సమాధాన ఒడంబడిక చేసుకోగలం?” అని అడిగారు.

  6. అందుకు వారు, “మేము మీ దాసులం” అని యెహోషువతో అన్నారు. కాని యెహోషువ, “మీరెవరు, ఎక్కడ నుండి వచ్చారు?” అని వారిని అడిగాడు.

  7. అందుకు వారు: “మీ దేవుడైన యెహోవా కీర్తిని గురించి విని, మీ దాసులమైన మేము చాలా దూరదేశం నుండి వచ్చాము. ఆయన ఈజిప్టులో చేసినదంతటిని గురించి,

  8. యొర్దాను తూర్పున ఉన్న అమోరీయుల ఇద్దరు రాజులకు అనగా హెష్బోను రాజైన సీహోను, అష్తారోతులో పాలించిన బాషాను రాజైన ఓగులకు చేసిన దాన్ని గురించి విన్నాము.

  9. కాబట్టి మా పెద్దలు, మా దేశవాసులంతా మాతో, ‘ప్రయాణానికి అవసరమైన ఆహారం తీసుకుని వెళ్లి వారిని కలిసి వారితో, “మేము మీ దాసులం; మాతో సమాధాన ఒడంబడిక చేయండి” అని చెప్పండి’ అన్నారు.

  10. మేము మీ దగ్గరకు రావడానికి బయలుదేరిన రోజు ఇంట్లో చేసినప్పుడు మా ఈ రొట్టెలు వేడిగా ఉన్నాయి. కానీ ఇప్పుడవి ఎండిపోయి బూజు పట్టి ఉన్నాయి చూడండి.

  11. ఈ ద్రాక్షరసం తిత్తులు మేము నింపినప్పుడు క్రొత్తవే, కాని ఇప్పుడు చినిగిపోయాయి. చాలా దూరం ప్రయాణం చేయడంతో మా బట్టలు, చెప్పులు అరిగిపోయాయి.”

  12. అయితే ఇశ్రాయేలీయులు యెహోవాను అడగకుండానే వారి ఆహారంలో కొంత తీసుకున్నారు.

  13. తర్వాత యెహోషువ వారిని బ్రతకనివ్వడానికి వారితో సమాధాన ఒడంబడిక చేశాడు, దానిని సమాజ నాయకులు ప్రమాణం చేసి ఆమోదించారు.

  14. గిబియోనీయులతో సమాధాన ఒడంబడిక చేసుకున్న మూడు రోజుల తర్వాత, వారు తమ పొరుగువారని, తమ దగ్గర నివసిస్తున్నారని ఇశ్రాయేలీయులు విన్నారు.