Skip to content

Slothfulness గురించి బైబిల్ వచనాలు

38 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. సోమరీ, చీమల దగ్గరకు వెళ్లు; అవి నడిచే విధానం చూసి జ్ఞానం తెచ్చుకో.

  2. వాటికి అధిపతులు లేరు, పర్యవేక్షించేవారు లేరు, పాలకులు లేరు,

  3. అయినా అవి వేసవికాలంలో ఆహారాన్ని సమకూర్చుకుంటాయి, కోతకాలంలో ధాన్యాన్ని దాచుకుంటాయి.

  4. సోమరీ, ఎప్పటి వరకు నీవు పడుకుంటావు? ఎప్పుడు నిద్ర లేస్తావు?

  5. ఇంకొంచెం నిద్ర, ఇంకొంచెం కునుకు, ఇంకొంచెం సేపు విశ్రాంతి అంటూ చేతులు ముడుచుకుంటాను అంటావు.

  6. పేదరికం నీ మీదికి దొంగలా, లేమి ఆయుధాలు ధరించినవానిలా నీ మీదికి వస్తుంది.

  7. సోమరి చేతులు దరిద్రత తెస్తాయి, కాని శ్రద్ధగా పని చేసేవారి చేతులు ధనాన్ని తెస్తాయి.

  8. వేసవిలో పంటను కూర్చేవారు వివేకంగల పిల్లలు, అయితే కోతకాలంలో నిద్రించేవారు అవమానాన్ని తెచ్చే పిల్లలు.

  9. పళ్ళకు పులిసిన ద్రాక్షరసంలా కళ్లకు పొగలా, తమను పంపినవారికి సోమరివారు అలా ఉంటారు.

  10. శ్రద్ధగా పని చేసేవారు అధికారులవుతారు కానీ సోమరులు బానిసలవుతారు.

  11. సోమరి మనుష్యులు తాము వేటాడిన మాంసాన్ని కాల్చరు, కానీ శ్రద్ధగల వారు తమకు దొరికిన ప్రతీదానిని ఉపయోగిస్తారు.

  12. సోమరి ఆకలి ఎన్నటికి తీరదు, కాని శ్రద్ధగా పని చేసేవారు తృప్తి చెందుతారు.

  13. సోమరి వాని బాట ముండ్లకంచె, యథార్థవంతుల త్రోవ రహదారి.

  14. పనిలో అలసత్వం ప్రదర్శించేవాడు, వినాశకునికి సోదరుడు.

  15. సోమరితనం గాఢనిద్ర కలుగజేస్తుంది, సోమరివాడు తిండి లేక ఉంటాడు.

  16. సోమరి పాత్రలో చేయి ముంచునేగాని; తన నోటికి దాని తిరిగి ఎత్తనైనా ఎత్తడు.

  17. విత్తనం వేసే సమయంలో సోమరి దున్నడు; కోత సమయంలో పంటను గురించి వాడు తెలుసుకునేసరికి వానికేమియు ఉండదు.

  18. సోమరుల కోరికలు వారిని చంపుతాయి, ఎందుకంటే వారి చేతులు పని చేయడానికి నిరాకరిస్తాయి.

  19. సోమరి అంటాడు, “బయట సింహమున్నది! వీధుల్లో నేను చంపబడతాను!”

  20. ఎందుకంటే త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులౌతారు, మగత వారిని దుప్పట్లలో వస్త్రాల్లా ధరిస్తుంది.

  21. నేను ఒక సోమరివాని చేను దాటి వెళ్లాను, నేను బుద్ధిలేని ఒక వ్యక్తి ద్రాక్షతోటను దాటి వెళ్లాను;

  22. అంతట ముళ్ళ కంపలు పెరిగాయి, నేలంతా కలుపు మొక్కల చేత కప్పబడి ఉంది, దాని రాతి గోడ శిథిలావస్థలో ఉంది.

  23. నేను దాన్ని చూసి దాని గురించి యోచన చేసి దాని నుండి నేను ఒక పాఠం నేర్చుకున్నాను.

  24. ఇంకొంచెం నిద్ర, ఇంకొంచెం కునుకు, ఇంకొంచెం సేపు విశ్రాంతి అంటూ చేతులు ముడుచుకుంటాను.

  25. పేదరికం నీ మీదికి దొంగలా, లేమి ఆయుధాలు ధరించినవానిలా నీ మీదికి వస్తుంది.