Skip to content

Slime గురించి బైబిల్ వచనాలు

5 వచనాలు · 5 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. కాబట్టి నీకోసం తమాల వృక్ష చెక్కతో ఒక ఓడను నిర్మించుకో; దానిలో గదులు చేసి, దానికి లోపల బయట కీలు పూయాలి.

  2. వారు ఒకరితో ఒకరు, “రండి ఇటుకలు చేసి వాటిని బాగా కాలుద్దాం” అని చెప్పుకున్నారు. వారు రాళ్లకు బదులు ఇటుకలు, అడుసుకు బదులుగా కీలుమట్టి వాడారు.

  3. సిద్దీము లోయ అంతా కీలుమట్టి గుంటలు ఉన్నాయి. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోతూ ఉన్నప్పుడు, కొంతమంది వాటిలో పడిపోయారు మిగిలినవారు కొండల్లోకి పారిపోయారు.

  4. కాని ఆమె వానిని ఇక దాచలేకపోయినప్పుడు, వాని కోసం ఒక జమ్ము బుట్ట తీసుకుని దానికి జిగటమన్ను తారు పూసింది. ఆ పిల్లవాన్ని అందులో పడుకోబెట్టి దానిని నైలు నది ఒడ్డున ఉన్న జమ్ములో ఉంచింది.

  5. ఎదోము నీటిప్రవాహాలు కీలుగా దాని మట్టి మండుతున్న గంధకంగా మారుతుంది. దాని భూమి మండుతున్న కీలుగా ఉంటుంది.