Ships గురించి బైబిల్ వచనాలు: Carrying passengers
Carrying passengers గురించి వచనాలు
అయితే యోనా యెహోవా సన్నిధి నుండి పారిపోదామని తర్షీషు వైపు వెళ్లాడు. అతడు యొప్పేకు వెళ్లి అక్కడ తర్షీషుకు వెళ్లే ఓడను చూశాడు. అతడు డబ్బు చెల్లించి, యెహోవా నుండి పారిపోవడానికి ఓడ ఎక్కి తర్షీషుకు ప్రయాణమయ్యాడు.
మేము అద్రముత్తియ పట్టణం నుండి ఆసియా తీరప్రాంత పట్టణాల గుండా ప్రయాణించే ఓడ ఎక్కి, ప్రయాణించేటప్పుడు మాసిదోనియలోని థెస్సలొనీక పట్టణానికి చెందిన అరిస్తర్కు అనేవాడు మాతో ఉన్నాడు.
అక్కడ ఆ శతాధిపతి ఇటలీ దేశానికి వెళ్తున్న అలెక్సంద్రియ పట్టణానికి చెందిన ఓడను చూసి దానిలోనికి మమ్మల్ని ఎక్కించాడు.
మేము మూడు నెలలు ద్వీపంలో శీతాకాలం గడిపిన తర్వాత కాస్టర్, పోలుక్స్ అనే కవల దేవతల చిహ్నం కలిగిన అలెక్సంద్రియ పట్టణానికి వెళ్లే ఓడ ఎక్కి బయలుదేరాము.