Skip to content

Shelah గురించి బైబిల్ వచనాలు

8 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

  1. ఆమె మరొక కుమారుని కన్నది, అతనికి షేలా అని పేరు పెట్టింది. ఆమె కజీబులో ఇతనికి జన్మనిచ్చింది.

  2. అప్పుడు యూదా తన కోడలు తామారుతో, “నా కుమారుడు షేలా ఎదిగే వరకు నీ తండ్రి ఇంట్లో విధవరాలుగా ఉండు” అని అన్నాడు. ఎందుకంటే అతడు, “తన అన్నల్లా ఇతడు కూడా చనిపోతాడేమో” అని అనుకున్నాడు. కాబట్టి తామారు తన తండ్రి ఇంట్లో ఉండడానికి వెళ్లింది.

  3. తన విధవరాలి బట్టలు తీసివేసి తలమీద ముసుగు వేసుకుని, తిమ్నా మార్గంలో ఉన్న ఎనయీము అనే గ్రామ ప్రవేశం దగ్గర కూర్చుంది. షేలా పెద్దవాడైనా కూడా ఆమె అతనికి భార్యగా ఇవ్వబడలేదు కాబట్టి ఆమె అలా చేసింది.

  4. యూదా అవి తనవేనని గుర్తుపట్టి ఇలా అన్నాడు, “ఆమె నాకంటే నీతిమంతురాలు, ఎందుకంటే నేను ఆమెను నా కుమారుడైన షేలాకు ఇచ్చి పెళ్ళి చేయలేదు.” ఆ తర్వాత అతడు ఆమెతో మరలా ఎప్పుడూ పడుకోలేదు.

  5. యూదా కుమారులు: ఏరు, ఓనాను, షేలా, పెరెసు, జెరహు. (కాని ఏరు, ఓనాను కనాను దేశంలో చనిపోయారు). పెరెసు కుమారులు: హెస్రోను, హామూలు.

  6. యూదా వారసులు వారి వంశాల ప్రకారం: షేలా ద్వార, షేలాహీయుల వంశం; పెరెసు ద్వార, పెరెజీయుల వంశం; జెరహు ద్వార, జెరహీయుల వంశము.

  7. యూదా కుమారులు: ఏరు, ఓనాను, షేలా. ఈ ముగ్గురు కనానీయురాలైన బత్-షుయ కుమార్తెకు జన్మించారు. యూదాకు మొదటి కుమారుడైన ఏరు యెహోవా దృష్టిలో చెడ్డవానిగా ఉన్నాడు కాబట్టి ఆయన వానిని చంపారు.

  8. యూదా కుమారుడైన షేలా కుమారులు: లేకా తండ్రియైన ఏరు, మరేషా తండ్రియైన లద్దా, సన్నని నారబట్టలు నేసే బేత్-అష్బేయ వంశీకులు,