Shealtiel గురించి బైబిల్ వచనాలు: Called also Salathiel, father of Zerubbabel and ancestor of Jesus.
Called also Salathiel, father of Zerubbabel and ancestor of Jesus. గురించి వచనాలు
ఖైదీగా ఉన్న యెహోయాకీను సంతానం: అతని కుమారుడు షయల్తీయేలు,
అప్పుడు యోజాదాకు కుమారుడైన యెషూవ, అతని తోటి యాజకులు, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, అతని తోటి పనివారు దైవజనుడైన మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారంగా దహనబలులు అర్పించడానికి ఇశ్రాయేలీయుల దేవునికి బలిపీఠాన్ని కట్టడం మొదలుపెట్టారు.
యెరూషలేములోని దేవుని ఆలయానికి వారు వచ్చిన రెండవ సంవత్సరం రెండవ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, యోజాదాకు కుమారుడైన యెషూవ యాజకులు, ఇతర ప్రజలు (యాజకులు, లేవీయులు, బందీ నుండి విడుదల పొంది యెరూషలేముకు వచ్చిన వారందరు) పని ప్రారంభించారు. లేవీయులలో ఇరవై సంవత్సరాలకన్నా ఎక్కువ వయస్సున్న వారిని యెహోవా మందిరపు పనిని పర్యవేక్షించడానికి నియమించారు.
అప్పుడు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, యోజాదాకు కుమారుడైన యెషూవ, యెరూషలేములో దేవుని మందిరాన్ని మళ్ళీ కట్టించడం మొదలుపెట్టారు. దేవుని ప్రవక్తలు వారితో ఉండి వారికి మద్ధతు ఇచ్చారు.
షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతో యెషూవతో పాటు వచ్చిన యాజకులు లేవీయులు వీరే: శెరాయా, యిర్మీయా, ఎజ్రా,
రాజైన దర్యావేషు పరిపాలనలో రెండవ సంవత్సరం ఆరో నెల మొదటి రోజున ప్రవక్తయైన హగ్గయి ద్వారా యూదాదేశపు అధికారియు షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలుకు, ప్రధాన యాజకుడైన యెహోజాదాకు కుమారుడైన యెహోషువకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలా చెప్పింది:
షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, యెహోజాదాకు కుమారుడును ప్రధాన యాజకుడునైన యెహోషువ, మిగిలి ఉన్న ప్రజలందరూ తమ దేవుడైన యెహోవా మాట విని, తమ దేవుడైన యెహోవా ప్రవక్తయైన హగ్గయిని పంపి తెలియజేసిన సందేశానికి లోబడి యెహోవా పట్ల భయభక్తులు చూపించారు.
యెహోవా యూదాదేశపు అధికారిగా ఉన్న షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలు మనస్సును, ప్రధాన యాజకుడైన యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనసును, మిగిలి ఉన్న ప్రజలందరి మనస్సులను ప్రేరేపించగా వారందరూ వచ్చి, వారి దేవుడైన సైన్యాల యెహోవా మందిరపు పనిని,
“నీవు యూదాదేశపు అధికారిగా ఉన్న షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతో, ప్రధాన యాజకుడైన యెహోజాదాకు కుమారుడైన యెహోషువతో, మిగిలి ఉన్న ప్రజలందరితో మాట్లాడి ఇలా అడుగు,
“ ‘అయితే షయల్తీయేలు కుమారుడవైన జెరుబ్బాబెలూ, నీవు నా సేవకుడవు. నేను నిన్ను ఎన్నుకున్నాను. కాబట్టి ఆ రోజున నేను నిన్ను తీసుకుని నా ముద్ర ఉంగరంలా చేస్తాను, ఎందుకంటే నేను నిన్ను ఏర్పరచుకున్నాను’ ఇదే సైన్యాల యెహోవా వాక్కు.”
బబులోనుకు కొనిపోబడిన తర్వాత పుట్టినవారు వీరే: యెకొన్యా కుమారుడు షయల్తీయేలు, షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలు.
యోదా యోహన్న కుమారుడు, యోహన్న రేసా కుమారుడు, రేసా జెరుబ్బాబెలు కుమారుడు, జెరుబ్బాబెలు షయల్తీయేలు కుమారుడు, షయల్తీయేలు నేరి కుమారుడు,