Skip to content

Sanitation గురించి బైబిల్ వచనాలు

289 వచనాలు · 10 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “స్త్రీకైనా పురుషునికైనా తలమీద గాని గడ్డం మీద గాని పుండు ఏర్పడితే,

  2. యాజకుడు ఆ పుండును పరీక్షించాలి, ఒకవేళ అది చర్మంపై లోతుగా ఉండి అందులో పసుపు రంగులో సన్నని వెంట్రుకలుంటే, యాజకుడు వారిని అపవిత్రులని ప్రకటించాలి; అది తలమీద గాని గడ్డం మీద గాని ఏర్పడిన గజ్జిపుండు.

  3. కాని యాజకుడు ఆ పుండును పరీక్షించినప్పుడు, అది చర్మంపై లోతుగా లేకపోతే, యాజకుడు వారిని ఏడు రోజులు వేరుగా ఉంచాలి.

  4. ఏడవ రోజు యాజకుడు ఆ గజ్జిపుండును పరీక్షించాలి, ఒకవేళ అది వ్యాపించకపోతే, అందులో పసుపురంగు వెంట్రుకలు లేకపోతే, చర్మంపై లోతుగా లేకపోతే,

  5. ఆ పురుషుడు గాని ఆ స్త్రీ గాని పుండు ఉన్న చోటు వదిలి క్షవరం చేసుకోవాలి క్షౌరం చేసుకోవచ్చు, యాజకుడు వారిని మరో ఏడు రోజులు వేరుగా ఉంచాలి.

  6. ఏడవ రోజు యాజకుడు ఆ గజ్జిపుండును పరీక్షించాలి, అది చర్మంపై వ్యాపించకుండ చర్మంపై లోతుగా లేకపోతే, యాజకుడు వారిని పవిత్రులని ప్రకటించాలి. వారు తమ బట్టలు ఉతుక్కోవాలి, అప్పుడు వారు ఆచారరీత్య పవిత్రులవుతారు.

  7. కానీ వారు పవిత్రులని ప్రకటించిన తర్వాత ఒకవేళ గజ్జిపుండు వ్యాపిస్తే,

  8. యాజకుడు వారిని పరీక్షించి ఒకవేళ ఆ గజ్జిపుండు చర్మంపై వ్యాపించినట్లు కనబడితే, అతడు పసుపురంగు వెంట్రుకల కోసం చూడాల్సిన అవసరం లేదు; వారు అపవిత్రులు.

  9. ఒకవేళ, యాజకుడు చూసే వరకు ఆ పుండు అలాగే ఉండి, ఒకవేళ దానిపై నల్ల జుట్టు పెరిగితే, వారు బాగయ్యారని అర్థము. వారు శుభ్రంగా ఉన్నారు, యాజకుడు వారిని పవిత్రులని ప్రకటించాలి.

  10. “పురుషునికి గాని స్త్రీకి గాని చర్మంపై తెల్ల మచ్చలు ఉంటే,

  11. యాజకుడు వాటిని పరీక్షించాలి, ఒకవేళ ఆ మచ్చలు స్పష్టంగా కనబడక మామూలుగా ఉంటే, అవి చర్మం మీద వచ్చిన సాధారణ పొక్కులు, అవి హానికరం కావు; వారు ఆచారరీత్య పవిత్రులు.

  12. “తలవెంట్రుకలు రాలిపోయి బట్టతల ఉన్న పురుషుడు పవిత్రుడు.

  13. ఒకవేళ తల ముందు భాగంలో వెంట్రుకలు రాలిపోయి, నుదురు బోడిగా ఉంటే, అతడు పవిత్రుడు.

  14. అయితే అతని బట్టతలపై గాని లేదా నుదిటిపై గాని గులాబి రంగు పుండు ఉంటే, అది అతని తలమీద గాని నుదుటి మీద గాని ఏర్పడుతున్న తీవ్రమైన కుష్ఠువ్యాధి.

  15. యాజకుడు అతన్ని పరీక్షించాలి, ఒకవేళ అతని తలపై గాని నుదిటిపై వాచిన పుండు గులాబి రంగులో తీవ్రమైన కుష్ఠువ్యాధిలా ఉంటే,

  16. ఆ పురుషుడు వ్యాధిగ్రస్తుడు, అపవిత్రుడు. యాజకుడు అతని తలపై ఉన్న కుష్ఠువ్యాధిని బట్టి అతన్ని అపవిత్రునిగా ప్రకటించాలి.

  17. “అలాంటి కుష్ఠువ్యాధి ఉన్నవారెవరైనా తప్పనిసరిగా చిరిగిన బట్టలు ధరించాలి, చింపిరి జుట్టుతో ఉండాలి, వారు తమ నోటిని కప్పుకుని, ‘అపవిత్రులం! అపవిత్రులం!’ అని బిగ్గరగా అరవాలి.

  18. వారికి వ్యాధి ఉన్నంత వరకు వారు అపవిత్రులే. వారు ఒంటరిగా జీవించాలి; వారు శిబిరం బయట నివసించాలి.

  19. “అపవిత్రమైన మరకతో పాడైన వస్త్రానికి సంబంధించి, అవి ఉన్నివైనా లేదా నార వస్త్రాలైనా,

  20. నారతో నేసిన వస్త్రాలైనా లేదా ఉన్నితో అల్లిన వస్త్రాలైనా, చర్మమైనా, చర్మంతో చేసినవైనా,

  21. ఒకవేళ వస్త్రాల్లో గాని, చర్మంలో గాని, నేసిన దుస్తుల్లో గాని లేదా అల్లిన దుస్తుల్లో గాని, లేదా ఏదైనా చర్మంతో చేయబడిన వస్తువు మీద గాని పాడైన చోట పచ్చగా లేదా ఎరుపుగా ఉంటే, అది కుష్ఠు మరక యొక్క లక్షణం కాబట్టి తప్పక యాజకునికి చూపించాలి.

  22. యాజకుడు ఆ పాడైన చోటును పరీక్షించి ఏడు రోజులు ఆ వస్తువును వేరుగా ఉంచాలి.

  23. ఏడవ రోజు అతడు దానిని పరీక్షించాలి, ఒకవేళ వస్త్రంలో గాని, నేసిన దానిలో గాని లేదా అల్లిన దానిలో గాని, లేదా చర్మంలో గాని, చర్మంతో చేసినవైనా దానిలో గాని వ్యాపిస్తే, దాని ఉపయోగం ఏదైనా, అది తీవ్రమైన కుష్ఠు మరక; ఆ వస్తువు అపవిత్రము.

  24. పాడైన వస్త్రమైనా, నారతో గాని ఉన్నితో గాని నేసిన లేదా అల్లిన వస్త్రాలైనా, లేదా చర్మంలో గాని, చర్మంతో చేసిన వస్తువైనా అతడు తప్పక కాల్చివేయాలి, ఎందుకంటే అది తీవ్రమైన మరక, ఆ వస్తువు తప్పనిసరిగా కాల్చివేయబడాలి.

  25. “కానీ ఒకవేళ యాజకుడు దానిని పరీక్షించినప్పుడు, మరక వస్త్రంపై గాని, నేసిన దుస్తులపై గాని లేదా అల్లిన దుస్తులపై గాని, చర్మంపై గాని లేదా చర్మంతో చేసిన వస్తువుపై గాని వ్యాపించి ఉండకపోతే,