Salvation గురించి బైబిల్ వచనాలు: Of the Gentiles, predicted
Of the Gentiles, predicted గురించి వచనాలు
“భూమి అంచుల్లో నివసించే మీరందరు నా వైపు తిరిగి రక్షణ పొందండి; నేనే దేవుడను, వేరే ఎవరూ లేరు.
ఆయన అంటున్నారు: “నీవు యాకోబు గోత్రాలను పునరుద్ధరించడానికి, ఇశ్రాయేలులో నేను తప్పించిన వారిని తిరిగి రప్పించడానికి నా సేవకునిగా ఉండడం నీకు చాలా చిన్న విషయము. నేనిచ్చే రక్షణ భూమి అంచుల వరకు చేరడానికి యూదేతర ప్రజలకు వెలుగుగా నేను నిన్ను చేస్తాను.”
అన్ని దేశాలు చూస్తుండగా యెహోవా తన పరిశుద్ధ చేతిని విప్పుతారు. భూమి అంచుల వరకు ఉండేవారంతా మన దేవుని రక్షణను చూస్తారు.