కంటెంట్‌కు వెళ్లండి

Offerings గురించి బైబిల్ వచనాలు

433 వచనాలు · 61 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. పాపపరిహారబలి కోసం మేకపోతు;

  2. సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు.

  3. బలిపీఠం అభిషేకించబడినప్పుడు దాని ప్రతిష్ఠించడానికి ఇశ్రాయేలీయుల నాయకులు సమర్పించిన అర్పణలు ఇవి: పన్నెండు వెండి పళ్ళాలు, పన్నెండు వెండి పాత్రలు పన్నెండు బంగారు పాత్రలు.

  4. వెండి పళ్ళెం ఒక్కొక్కటి నూట ముప్పై షెకెళ్ళు, వెండి పాత్ర ఒక్కొక్కటి డెబ్బై షెకెళ్ళు. అంతా కలిపితే వెండి పాత్రల బరువు పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం రెండువేల నాలుగు వందల షెకెళ్ళు.

  5. ధూపద్రవ్యాలతో నిండియున్న బంగారు పళ్ళాలు, పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం పది షెకెళ్ళ బరువు గలవి పన్నెండు. అంతా కలిపితే, బంగారు పాత్రల బరువు నూట యిరవై షెకెళ్ళు.

  6. దహనబలి కోసం వాటి భోజనార్పణతో పాటు ఇవ్వబడిన పశువులు మొత్తం పన్నెండు కోడెలు, పన్నెండు పొట్టేళ్లు. పన్నెండు ఏడాది గొర్రెపిల్లలు. పన్నెండు మేకపోతులు పాపపరిహారబలి కోసం వాడబడ్డాయి.

  7. సమాధానబలి కోసం ఇవ్వబడిన పశువులు మొత్తం యిరవై నాలుగు ఎడ్లు, అరవై పొట్టేళ్లు, అరవై మేకపోతులు అరవై ఏడాది గొర్రెపిల్లలు.

  8. అంతేకాక మీ సంతోష సమయాల్లో అంటే నియమించబడిన పండుగలు, అమావాస్య వేడుకలప్పుడు మీ దహనబలులు, మీ సమాధాన బలులపై బూరధ్వని చేయండి. అవి మీ దేవుని ఎదుట జ్ఞాపకార్థంగా ఉంటాయి. నేను మీ దేవుడనైన యెహోవానై ఉన్నాను.”

  9. అప్పుడు అర్పణ తెచ్చే వ్యక్తి ఒక పావు హిన్ నూనెలో ఒక ఓమెరు నాణ్యమైన పిండి కలిపి యెహోవాకు భోజనార్పణ సమర్పించాలి.

  10. దహనబలి లేదా బలి కోసం తెచ్చే ప్రతి గొర్రెపిల్లతో పాటు ఒక పావు హిన్ ద్రాక్షరసం పానార్పణంగా తేవాలి.

  11. వచ్చే తరాలకు కూడా ఇదే నియమం వర్తిస్తుంది. విదేశీయులు లేదా మీ మధ్య నివసించే ఎవరైనా సరే, యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి అర్పించాలనుకుంటే, మీలాగే వారు కూడా చేయాలి.

  12. సమాజంలో ఉండే మీరైనా, విదేశీయులైనా ఒకే చట్టం పాటించాలి; ఇది రాబోయే తరాలకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది. యెహోవా దృష్టిలో మీరూ విదేశీయులు ఒక్కటే:

  13. మీకూ, మీ మధ్య ఉన్న విదేశీయులకు అవే నియమాలు, అవే నిబంధనలు వర్తిస్తాయి.’ ”

  14. ఆ దేశం ఆహారాన్ని మీరు తినేటప్పుడు, ఒక భాగం యెహోవాకు అర్పణగా సమర్పించాలి.

  15. ఒకవేళ తెలియక పొరపాటున మీరితే, అప్పుడు సమాజమంతా యెహోవాకు ఇష్టమైన సువాసనగల దహనబలిగా కోడెను, దానితో పాటు నిర్దేశించిన భోజనార్పణ, పానార్పణలతో, పాపపరిహారబలి కోసం మేకపోతుతో కలిపి అర్పించాలి.

  16. బలిపీఠం మీది నిప్పులో కాల్చివేయబడని అతి పవిత్ర అర్పణలలో కొంత భాగం మీరు తీసుకోవాలి. నాకు వారు తెచ్చే అతి పవిత్రమైన భోజనార్పణలు పాపపరిహారబలులు అపరాధబలులు నీకు, నీ కుమారులకు చెందినవి.

  17. “సమావేశ గుడారం దగ్గర సేవ చేస్తున్న లేవీయులకు పారితోషికంగా ఇశ్రాయేలీయులు ఇచ్చే దశమ భాగాలను స్వాస్థ్యంగా ఇస్తున్నాను.

  18. దానితో పాటు ఒక ఓమెరు నాణ్యమైన పిండిని, ఒక పావు హిన్ ఒలీవనూనెతో కలిపి భోజనార్పణగా అర్పించాలి.

  19. ఇది సీనాయి కొండపై నియమించబడిన క్రమం తప్పకుండ అర్పించే దహనబలి, యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి.

  20. దానితో పాటు ఒక పావు హిన్ పులియబెట్టిన పానీయాన్ని పానార్పణగా ప్రతి గొర్రెపిల్లతో పాటు అర్పించాలి. పరిశుద్ధాలయం దగ్గర యెహోవాకు పానార్పణ పోయాలి.

  21. సాయంకాలం రెండవ గొర్రెపిల్లతో కలిపి ఉదయకాలం అర్పించినట్లే భోజనార్పణను పానార్పణను అర్పించాలి. ఇది యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి.

  22. “ ‘సబ్బాతు దినాన, లోపం లేని ఒక ఏడాది వయస్సు ఉన్న రెండు గొర్రెపిల్లలను, వాటితో పాటు పానార్పణం, భోజనార్పణగా ఒలీవనూనెతో కలిపిన రెండు ఓమెర్ల నాణ్యమైన పిండి అర్పించాలి.

  23. ప్రతి సబ్బాతుకు క్రమం తప్పకుండ అర్పించే దహనబలి, పానార్పణంతో పాటు ఈ దహనబలి కూడా అర్పించాలి.

  24. “ ‘ప్రతి నెల మొదటి రోజు యెహోవాకు లోపం లేని రెండు కోడెలు, ఒక పొట్టేలు, యేడు ఏడాది మగ గొర్రెపిల్లలు దహనబలిగా అర్పించాలి.

  25. ప్రతి కోడెతో పాటు ఒలీవనూనె కలిపిన మూడు ఓమెర్ల నాణ్యమైన పిండితో భోజనార్పణ ఉండాలి; పొట్టేలుతో పాటు, నూనె కలిపిన రెండు ఓమెర్ల నాణ్యమైన పిండి భోజనార్పణగా ఉండాలి;