కంటెంట్‌కు వెళ్లండి

Offerings గురించి బైబిల్ వచనాలు: Peace offerings, laws concerning

23 వచనాలు · 61 కోణాలు

Peace offerings, laws concerning గురించి వచనాలు

  1. “మరొక పొట్టేలును తీసుకురావాలి, దాని తలమీద అహరోను అతని కుమారులు వారి చేతులుంచాలి.

  2. నీవు ఆ పొట్టేలును వధించి, దాని రక్తం కొంత తీసుకుని అహరోను అతని కుమారుల కుడిచెవి అంచుకు, వారి కుడిచేతి బొటన వ్రేలి మీద, కుడికాలు బొటన వ్రేలి మీద పూసి మిగిలిన రక్తాన్ని బలిపీఠం చుట్టూ చల్లాలి.

  3. బలిపీఠం మీద నుండి కొంచెం రక్తాన్ని కొంచెం అభిషేక తైలాన్ని తీసుకుని అహరోను మీద అతని వస్త్రాల మీద, అతని కుమారుల మీద వారి వస్త్రాల మీద చిలకరించాలి. అప్పుడు అతడు అతని కుమారులు వారి వస్త్రాలు కూడా పవిత్రం చేయబడతాయి.

  4. “ఆ పొట్టేలు ప్రతిష్ఠితమైనది కాబట్టి దాని క్రొవ్వును క్రొవ్విన దాని తోకను, లోపలి అవయవాలను కాలేయాన్ని క్రొవ్వుతో ఉన్న రెండు మూత్రపిండాలను, కుడి తొడను తీసుకోవాలి.

  5. “ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకుని పవిత్ర స్థలంలో దాని మాంసాన్ని వండాలి.

  6. “ ‘ఎవరైనా యెహోవాకు సమాధానబలి సమర్పించాలంటే నియమాలు ఇవి:

  7. “ ‘ఒకవేళ వారు దానిని కృతజ్ఞత అర్పణగా అర్పిస్తే, కృతజ్ఞతార్పణతో పాటు వారు ఒలీవనూనె కలిపి చేసిన పులియని మందమైన రొట్టెలు, నూనె రాసి తయారుచేసిన పులియని సన్నని రొట్టెలు, నూనె కలిపి మెత్తగా పిసికిన నాణ్యమైన పిండితో తయారుచేసిన మందమైన రొట్టెలు అర్పించాలి.

  8. కృతజ్ఞతతో కూడిన సమాధానబలితో పాటు వారు పులిసిన మందమైన రొట్టెలను సమర్పించాలి.

  9. వారు ప్రతి దానిలో నుండి ఒకదాన్ని అర్పణగా, యెహోవాకు ప్రత్యేక నైవేద్యంగా తీసుకురావాలి; అది బలిపీఠం వైపు సమాధానబలి రక్తాన్ని ప్రోక్షించిన యాజకునికి చెందుతుంది.

  10. కృతజ్ఞతతో అర్పించిన సమాధానబలి మాంసం అది అర్పించిన రోజే వారు తినాలి; ఉదయం వరకు అందులో దేన్ని మిగిలించకూడదు.

  11. సమాధానబలి మాంసం మూడవ రోజు కాబట్టి తింటే దానిని అర్పించిన వారు అంగీకరించబడరు. తెచ్చిన వానికి గుర్తింపు ఉండదు, ఎందుకంటే అది అపవిత్రమైంది; కాబట్టి దానిలో ఏదైన తింటే వారు దోషశిక్షను భరిస్తారు.

  12. అప్పుడు నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘పాపపరిహారబలి కోసం లోపం లేని ఒక మేకపోతును దహనబలి కోసం లోపం లేని ఒక దూడను, ఒక గొర్రెపిల్లను తీసుకురావాలి.

  13. యెహోవా ఎదుట బలి అర్పించడానికి సమాధానబలికి ఎద్దును, పొట్టేలును, ఒలీవనూనె కలిపిన భోజనార్పణతో పాటు తీసుకురండి. ఎందుకంటే యెహోవా ఈ రోజు మీకు ప్రత్యక్షమవుతారు.’ ”

  14. అప్పుడు అహరోను ప్రజల అర్పణను తీసుకువచ్చాడు. అతడు ప్రజల పాపపరిహారబలి కోసం మేకను తీసుకుని దానిని వధించి మొదటి దానిని చేసినట్లుగానే దీన్ని కూడా పాపపరిహారబలిగా అర్పించాడు.

  15. అతడు దహనబలిని తెచ్చి సూచించబడినట్టే అర్పించాడు.

  16. అతడు భోజనార్పణ కూడా తీసుకువచ్చి, దానిలో నుండి పిడికెడు తీసి బలిపీఠంపై దానిని ఉదయం చెల్లించాల్సిన దహనబలితో పాటు దహించాడు.

  17. ప్రజల నిమిత్తం అహరోను సమాధానబలిగా ఎద్దును, పొట్టేలును వధించాడు. అతని కుమారులు అతనికి రక్తాన్ని అందించగా, అతడు బలిపీఠం చుట్టూరా దానిని చల్లాడు.

  18. ఎద్దు క్రొవ్వును, పొట్టేలు క్రొవ్వును, క్రొవ్విన తోకను, లోపల అవయవాల మీద ఉన్న క్రొవ్వును, మూత్రపిండాలను, కాలేయం మీది క్రొవ్వును

  19. బోరల మీద వేశారు, అహరోను ఆ క్రొవ్వును బలిపీఠం మీద కాల్చాడు.

  20. మోషే ఆజ్ఞాపించినట్టు అహరోను రొమ్ము భాగాన్ని, కుడి తొడను పైకెత్తి ఊపి యెహోవా ఎదుట ప్రత్యేక అర్పణగా అర్పించాడు.

  21. పాపపరిహారబలి కోసం మేకపోతును, సమాధానబలిగా రెండు ఏడాది మగ గొర్రెపిల్లను అర్పించాలి.

  22. అక్కడ వారు యెహోవాకు తమ అర్పణలు అర్పించాలి: దహనబలి కోసం లోపం లేని ఏడాది మగ గొర్రెపిల్ల, పాపపరిహారబలి కోసం లోపం లేని ఆడ గొర్రెపిల్ల, సమాధానబలి కోసం లోపం లేని పొట్టేలు,

  23. అంతేకాక మీ సంతోష సమయాల్లో అంటే నియమించబడిన పండుగలు, అమావాస్య వేడుకలప్పుడు మీ దహనబలులు, మీ సమాధాన బలులపై బూరధ్వని చేయండి. అవి మీ దేవుని ఎదుట జ్ఞాపకార్థంగా ఉంటాయి. నేను మీ దేవుడనైన యెహోవానై ఉన్నాను.”