Net గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
స్తంభాల మీద ఉన్న పీటలకు అల్లిన గొలుసులతో, ప్రతి పీటకు ఏడు అల్లిన గొలుసులను వేశాడు.
వారి కాళ్లు వారిని వలలోనికి నడిపిస్తాయి; వారు వలలో పడతారు.
దేవుడు నాకు అన్యాయం చేశారని నా చుట్టూ ఆయన తన వల వేశారని తెలుసుకోండి.
తాము త్రవ్విన గోతిలోనే దేశాలు పడిపోయాయి; తాము పన్నిన వలలోనే వారి పాదాలు చిక్కుకున్నాయి.
గుహలో సింహంలా వారు వేచి ఉంటారు. నిస్సహాయులను పట్టుకోడానికి వారు ఎదురుచూస్తూ ఉంటారు; వారు నిస్సహాయులను తమ వలలోనికి లాగి పట్టుకుంటారు.
నా కళ్లు ఎప్పుడూ యెహోవా మీద ఉన్నాయి, ఎందుకంటే ఆయన మాత్రమే వలలో నుండి నా పాదాలు విడిపిస్తారు.
నా కోసం ఏర్పాటు చేయబడిన ఉచ్చులో పడకుండ నన్ను తప్పించండి, ఎందుకంటే మీరు నా ఆశ్రయమై ఉన్నారు.
కారణం లేకుండా వారు తమ వలను నా కోసం దాచారు నన్ను చిక్కించుకోడానికి వారు ఒక గొయ్యి తవ్వారు.
వారికి తెలియకుండానే వారి పైకి నాశనం వచ్చును గాక వారు నా కోసం దాచిన వలలో వారే చిక్కుకొందురు గాక! నా కోసం త్రవ్విన గొయ్యిలో వారే పడుదురు గాక.
నా పాదాల చుట్టూ వలలు వేశారు, నేను బాధతో క్రుంగి ఉన్నాను నా దారిలో వారు గుంట త్రవ్వారు కాని అందులో వారే పడ్డారు. సెలా
మీరు మమ్మల్ని వలలో బంధించారు, మా నడుముల మీద భారాన్ని మోపారు.
అహంకారులు చాటుగా వల ఉంచారు; వారు వల దాడులు పరచారు, నా మార్గం వెంట ఉచ్చులు పెట్టారు. సెలా
దుష్టులు తమ వలల్లో తామే చిక్కుకుంటారు, నేనైతే తప్పించుకు వెళ్తాను.
రెక్కలు గల పక్షులు చూస్తుండగా వల వేయడం నిష్ప్రయోజనం!
దుష్టులు కీడుచేసేవారి బలమైన కోటను కోరుకుంటారు, అయితే నీతిమంతుల వేరు చిగురిస్తుంది.
పొరుగువారిని పొగడేవారు వారి పాదాలకు వలలు వేస్తున్నారు.
నేను మరణం కన్నా దుఃఖకరమైనది తెలుసుకున్నాను, అది వల వంటిది, ఉచ్చులాంటి మనస్సు కలిగి సంకెళ్ల వంటి చేతులు కలిగిన స్త్రీ. దేవుని సంతోషపరిచేవారు ఆమె నుండి తప్పించుకుంటారు. కాని ఆమె పాపులను పట్టుకుంటుంది.
అంతేకాక, వాటి సమయం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు: చేపలు వలలో పట్టబడినట్లు, పక్షులు వలలో చిక్కుకున్నట్లు హఠాత్తుగా వారి మీద పడే చెడు కాలంలో ప్రజలు చిక్కుపడతారు.
జాలరులు మూల్గుతారు, దుఃఖిస్తారు, నైలు నదిలో గాలాలు వేసే వారందరు ఏడుస్తారు; నీటి మీద వలలు వేసేవారు విలపిస్తారు.
నీ పిల్లలు మూర్ఛపోయారు. దుప్పి వలలో చిక్కుకున్నట్లు ప్రతి వీధి మూలల్లో వారు పడిపోయారు. యెహోవా ఉగ్రతతో నీ దేవుని గద్దింపుతో వారు నిండిపోయారు.
సముద్రం దానిని చుట్టుముట్టినప్పుడు అది చేపల వలలు ఆరబెట్టే స్థలంగా మారుతుంది. నేనే మాట ఇచ్చాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అది జనాంగాలకు దోపుడు సొమ్ముగా మారుతుంది,
నేను నిన్ను వట్టి బండగా చేస్తాను, నీవు చేపల వలలు పరిచే స్థలం అవుతావు. నీవు ఎప్పటికీ కట్టబడవు, ఎందుకంటే యెహోవానైన నేనే చెప్పాను, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
ఎన్-గేదీ నుండి ఎన్-ఎగ్లయీము వరకు చేపలు పట్టేవారు ఒడ్డున నిలబడి వలలు వేస్తారు. మధ్యధరా సముద్రంలో ఉన్నట్లు అన్ని రకాల చేపలు మృత సముద్రంలో ఉంటాయి.
వారు వెళ్లేటప్పుడు, నేను వారి మీద నా వల వేస్తాను; నేను వారిని ఆకాశంలో పక్షుల్లా క్రిందికి లాగుతాను. వారు సమాజంగా కూడుకుంటున్నారని నేను విన్నప్పుడు, నేను వారిని శిక్షిస్తాను.
యేసు గలిలయ సముద్రతీరాన నడుస్తున్నప్పుడు పేతురు అని పిలువబడే సీమోను, అతని సోదరుడు అంద్రెయ అనే ఇద్దరు సోదరులు సముద్రంలో వలలు వేయడం ఆయన చూశారు. వారు జాలరులు.