Skip to content

Neighbor గురించి బైబిల్ వచనాలు: General references

70 వచనాలు · 1 కోణం

General references గురించి వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మీ పొరుగువారికి వ్యతిరేకంగా అబద్ధసాక్ష్యం చెప్పకూడదు.

  2. “ఒకవేళ నీ శత్రువు యొక్క ఎద్దు గాని గాడిద గాని తప్పిపోయి తిరుగుతూ నీకు కనబడితే, దానిని తప్పక తిరిగి అప్పగించాలి.

  3. నిన్ను ద్వేషించేవారి గాడిద ఒకవేళ అది మోస్తున్న బరువు క్రింద పడివుండడం చూస్తే దానిని అలాగే వదిలేయవద్దు; దానిని లేపడానికి వానికి ఖచ్చితంగా సహాయం చేయాలి.

  4. “ఒకవేళ మనుష్యులెవరైనా తన పొరుగువాడు తనకు అప్పగించిన దాని విషయంలో ఆ వ్యక్తిని మోసం చేసినా, వంచించినా, దోచుకున్నా, లేక ఒత్తిడిచేసినా, లేక పొరుగువాడు పోగొట్టుకున్న వస్తువు దొరికినా సరే దాని విషయం అబద్ధం చెప్పినా, ఒట్టు పెట్టి మరీ అబద్ధం చెప్పినా, ఇంకా ఇలాంటి వాటి విషయాల్లో పాపం చేస్తే అది యెహోవాకు వ్యతిరేకంగా ఆయన ఆజ్ఞలను ఉల్లంఘించి చేసిన పాపమే అవుతుంది.

  5. Or have found that which was lost, and lieth concerning it, and sweareth falsely; in any of all these that a man doeth, sinning therein:

  6. వారు వీటిలోని దేని విషయంలోనైనా పాపం చేసి తమ అపరాధాన్ని గ్రహిస్తే, వారు దొంగిలించిన లేదా దోపిడి ద్వారా తీసుకున్నా, లేదా వారికి అప్పగించబడినదైనా, లేదా పోయిన ఆస్తి తిరిగి దొరికినదైనా,

  7. లేదా వారు అబద్ధ ప్రమాణం చేసినదైనా, వారు తప్పక పూర్తి నష్టపరిహారం చెల్లించాలి, దానికి దాని వెలలో అయిదవ వంతు కలిపి వారు తమ అపరాధపరిహారబలి సమర్పించే రోజున దానినంతటిని యజమానికి ఇవ్వాలి.

  8. “ ‘పొరుగువారిని పీడించకండి లేదా దోచుకోకండి. “ ‘కూలివాళ్ళకు ఇవ్వాల్సిన కూలి మరుసటిరోజు ఉదయం వరకు మీ దగ్గర నిల్వ ఉంచుకోకూడదు.

  9. “ ‘మీ ప్రజల్లో కొండేలు వ్యాపింపచేస్తూ తిరగకూడదు. “ ‘మీ పొరుగువారి ప్రాణానికి అపాయం కలిగించేది ఏది చేయకూడదు. నేను యెహోవాను.

  10. “ ‘మీ తోటి ఇశ్రాయేలీయున్ని మీ హృదయంలో ద్వేషించకూడదు. మీ పొరుగువారి దోషం మీరు భరించకూడదు అంటే మీరు మీ పొరుగువారిని ఉన్నది ఉన్నట్లుగా గద్దించాలి.

  11. “ ‘ప్రతీకారం ప్రయత్నించవద్దు లేదా మీ ప్రజల్లో ఎవరి మీదా పగ పెట్టుకోవద్దు, కానీ మీకులా మీ పొరుగువారిని ప్రేమించాలి. నేను యెహోవానై ఉన్నాను.

  12. మీ తోటి ఇశ్రాయేలీయుల ఎద్దు లేదా గొర్రెలు దారితప్పినట్లు మీరు చూస్తే దానిని విస్మరించవద్దు. కానీ దానిని తిరిగి దాని యజమాని దగ్గరకు తీసుకెళ్లండి.

  13. ఒకవేళ వారు మీ దగ్గర నివసించకపోయినా లేదా దాని యజమాని ఎవరో మీకు తెలియకపోయినా, దానిని మీతో ఇంటికి తీసుకెళ్లి, వారు దానిని వెదుక్కునే వరకు ఉంచి, తర్వాత తిరిగి ఇచ్చేయండి.

  14. గాడిద గాని వస్త్రం గాని మరి ఏ వస్తువైనా దొరికితే ఇలాగే చేయాలి. దాన్ని విస్మరించవద్దు.

  15. మీ తోటి ఇశ్రాయేలీయుని గాడిద గాని ఎద్దు గాని దారిలో పడి ఉండడం మీరు చూస్తే, దానిని విస్మరించవద్దు. అది తిరిగి లేచి నిలబడేలా దాని యజమానికి సహాయం చేయండి.

  16. దావీదు కీర్తన. యెహోవా, మీ పవిత్ర గుడారంలో ఉండగలవారు ఎవరు? మీ పరిశుద్ధ పర్వతంపై నివసించగలవారు ఎవరు?

  17. నిందారహితంగా నడుచుకొనేవారు, నీతిని జరిగించేవారు, తమ హృదయం నుండి సత్యాన్ని మాట్లాడేవారు;

  18. తమ నాలుకతో అపవాదులు వేయనివారు, పొరుగువారికి కీడు చేయనివారు, స్నేహితుల గురించి చెడుగా మాట్లాడనివారు;

  19. నీవు నీ పొరుగువానికి ఇప్పుడు సహాయం చేయ కలిగి ఉండి, “రేపు రా నేను ప్రయత్నిస్తాను” అని నీ పొరుగువానితో అనవద్దు.

  20. నీ పొరుగువారు నమ్మకంగా నీ దగ్గర జీవిస్తున్నప్పుడు వారికి హాని తలపెట్టవద్దు.

  21. “నేను కోరుకునే ఉపవాసం అన్యాయపు సంకెళ్ళను విప్పడం, బరువైన కాడి త్రాళ్లు తీసివేయడం, బాధించబడిన వారిని విడిపించడం, ప్రతీ కాడిని విరగ్గొట్టడం కాదా?

  22. మీ ఆహారాన్ని ఆకలితో ఉన్నవారితో పంచుకోవడం, ఇల్లు లేక తిరుగుతున్న పేదలకు ఆశ్రయం కల్పించడం, మీరు ఎవరినైనా నగ్నంగా చూస్తే, వారికి బట్టలు ఇవ్వడం, మీ రక్తసంబంధులకు ముఖం దాచకపోవడమే కదా ఉపవాసం?

  23. అప్పుడు మీ వెలుగు ఉదయకాంతిలా ప్రకాశిస్తుంది. మీకు వెంటనే స్వస్థత కలుగుతుంది; అప్పుడు మీ నీతి మీ ముందుగా నడుస్తుంది యెహోవా మహిమ మీ వెనుక కాపలాగా ఉంటుంది.

  24. అప్పుడు మీరు పిలిస్తే యెహోవా జవాబిస్తారు; మీరు మొరపెడితే ఆయన నేనున్నాను అంటారు. “మీరు ఇతరులను బాధించడం, వ్రేలుపెట్టి చూపిస్తూ చెడు మాట్లాడడం మానేస్తే,

  25. ఆకలితో ఉన్నవారికి మీ దగ్గర ఉన్నది ఇచ్చి, బాధించబడినవారి అవసరాలను తీరిస్తే, చీకటిలో మీ వెలుగు ప్రకాశిస్తుంది, మీ చీకటి మధ్యాహ్నపు వెలుగుగా మారుతుంది.