Skip to content

Molding గురించి బైబిల్ వచనాలు

12 వచనాలు · 6 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. అతడు వారు తనకు ఇచ్చిన వాటిని తీసుకుని ఒక సాధనంతో దూడ రూపంలో పోతపోసి ఒక విగ్రహం తయారుచేశాడు. అప్పుడు వారు, “ఓ ఇశ్రాయేలూ, ఈజిప్టులో నుండి మిమ్మల్ని బయటకు రప్పించిన మీ దేవుళ్ళు వీరే” అని అన్నారు.

  2. నేను వారికి ఆజ్ఞాపించిన మార్గం నుండి చాలా త్వరగా తప్పిపోయి ఒక దూడ రూపంలో పోతపోసిన విగ్రహాన్ని తమ కోసం తయారుచేసుకుని దానికి సాష్టాంగపడి బలి అర్పించి, ‘ఇశ్రాయేలూ, ఈజిప్టులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుళ్ళు వీరే’ అని అన్నారు.

  3. “ఏ దేవుళ్ళ విగ్రహాలు చేసుకోకూడదు.

  4. “ ‘విగ్రహాలవైపు తిరగకండి లేదా మీ కోసం అచ్చు వేసిన విగ్రహ దేవుళ్ళను చేసుకోకండి. నేను మీ దేవుడనైన యెహోవాను.

  5. అప్పుడు యెహోవా నాతో, “నీవు వెంటనే ఇక్కడినుండి క్రిందికి వెళ్లు, నీవు ఈజిప్టు నుండి తీసుకువచ్చిన నీ ప్రజలు చెడిపోయారు. నేను వారికి ఆజ్ఞాపించిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి తమ కోసం ఒక విగ్రహాన్ని తయారుచేసుకున్నారు” అని చెప్పారు.

  6. అతడు రెండు ఇత్తడి స్తంభాలను పోత పోశాడు. ఒక్కొక్క దాని ఎత్తు పద్దెనిమిది మూరలు, చుట్టుకొలత పన్నెండు మూరలు.

  7. అతడు పోతపోసిన ఒక గుండ్రని నీళ్ల తొట్టె చేయించాడు. అది ఈ అంచు నుండి ఆ అంచు వరకు పది మూరలు, దాని ఎత్తు అయిదు మూరలు. దాని చుట్టుకొలత ముప్పై మూరలు.

  8. రాజు వీటన్నిటిని యొర్దాను సమతల మైదానంలో, సుక్కోతుకు సారెతానుకు మధ్య ఉన్న బంకమట్టితో పోతపోయించాడు.

  9. రాజు వీటన్నిటిని యొర్దాను సమతల మైదానంలో, సుక్కోతుకు సారెతానుకు మధ్య ఉన్న బంకమట్టితో పోతపోయించాడు.

  10. ఇనుము మట్టిలో నుండి తీయబడుతుంది, ధాతువు కరిగించి రాగి తీస్తారు.

  11. ఇత్తడితో పోతపోసిన అద్దంలా, ఆకాశాలను విస్తరింపజేయడంలో ఆయనతో నీవు జత కలుస్తావా?

  12. తర్వాత దానికున్న మలినం కరిగిపోయి, మడ్డి పూర్తిగా పోయేలా ఆ కుండ వేడెక్కి దాని రాగి మెరిసే వరకు దానిని బొగ్గుల మీద ఉంచండి.