Skip to content

Meditation గురించి బైబిల్ వచనాలు: General references

41 వచనాలు · 2 కోణాలు

General references గురించి వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఈ ధర్మశాస్త్ర గ్రంథం ఎప్పుడు నీ పెదాల మీద ఉండాలి; పగలు రాత్రి దానిని ధ్యానించాలి, తద్వార నీవు దానిలో వ్రాయబడి ఉన్న ప్రతిదీ శ్రద్ధగా చేయగలవు. అప్పుడు నీవు విజయవంతంగా వర్ధిల్లుతావు.

  2. యెహోవా ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందిస్తూ, రాత్రింబగళ్ళు దాన్ని ధ్యానిస్తూ ఉండేవారు ధన్యులు.

  3. వణకండి, పాపం చేయకండి. మీరు మీ పడకలో ఉన్నప్పుడు ధ్యానం చేసుకుంటూ ప్రశాంతంగా ఉండండి. సెలా

  4. యెహోవా, నా కొండ, నా విమోచకా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంగా ఉండును గాక.

  5. నా గుండె నాలో వేడెక్కింది. నేను ధ్యానిస్తూ ఉండగా మంట రగులుకుంది; అప్పుడు నోరు తెరచిమాట్లాడాను:

  6. నా నోరు జ్ఞానాన్ని పలుకుతుంది; నా హృదయ ధ్యానం మీకు అవగాహన ఇస్తుంది.

  7. శ్రేష్ఠమైన ఆహారం దొరికినట్లు నేను సంతృప్తి పొందుతాను; సంతోషించే పెదవులతో నా నోరు మిమ్మల్ని స్తుతిస్తుంది.

  8. పడక మీద నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను; రాత్రి జాముల్లో నేను మీ గురించి ఆలోచిస్తాను.

  9. దుష్టులు ఇలా ఉంటారు. ఎప్పుడూ ఏ జాగ్రత్తలు లేకుండ సంపద కూడబెట్టుకుంటారు.

  10. నేను నా హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవడం వ్యర్థమే నేను నా చేతులు కడుక్కుని నిర్దోషంగా ఉండడం వ్యర్థమే.

  11. రోజంతా నేను బాధింపబడ్డాను, ప్రతి ఉదయం నూతన శిక్షలు వస్తున్నాయి.

  12. నేను అలా మాట్లాడాలని అనుకుని ఉంటే, నేను మీ పిల్లలను మోసం చేసినట్టే.

  13. ఇదంతా నేను అర్థం చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు, నేను దేవుని పరిశుద్ధాలయంలో ప్రవేశించే వరకు అది నన్ను గాఢంగా ఇబ్బంది పెట్టింది; అప్పుడు నేను వారి చివరి గమ్యమేంటో గ్రహించాను.

  14. Until I went into the sanctuary of God; then understood I their end.

  15. ఖచ్చితంగా మీరు వారిని జారే నేలపై ఉంచారు; మీరు వారిని పతనానికి పడవేస్తారు.

  16. వారు అకస్మాత్తుగా నాశనమవుతారు, వారు భయంతో పూర్తిగా నశిస్తారు!

  17. ప్రభువా, మీరు లేచినప్పుడు, ఒకరు మేల్కొన్నప్పుడు ఒక కలలో చూసినవి మరచినట్లు; మీరు వారి ఉనికిని తృణీకరిస్తారు.

  18. నా హృదయం దుఃఖించినప్పుడు నా ఆత్మ నీరసించినప్పుడు,

  19. నేను తెలివిలేని వాడను, అజ్ఞానిని; మీ ఎదుట నేను క్రూరమైన మృగంలా ఉన్నాను.

  20. అప్పుడు నేను ఇలా అనుకున్నాను, “ఇది నా విధి: మహోన్నతుడు నాకు వ్యతిరేకంగా చేయి ఎత్తారు.

  21. యెహోవా కార్యాలను గుర్తు చేసుకుంటాను; అవును, చాలా కాలంనాటి మీ అద్భుతాలను జ్ఞాపకం చేసుకుంటున్నాను.

  22. మీ కార్యాలన్నిటిని నేను తలంచుకుంటాను, మీ గొప్ప క్రియలన్నిటిని నేను ధ్యానిస్తాను.”

  23. నేను యెహోవాయందు ఆనందిస్తుండగా, నా ధ్యానము ఆయనకు ఇష్టమైనదిగా ఉండును గాక.

  24. నేను మీకు విరోధంగా పాపం చేయకూడదని మీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకున్నాను.

  25. మీ శాసనాలను నేను ధ్యానిస్తాను మీ మార్గాలను పరిగణిస్తాను.