Maachah గురించి బైబిల్ వచనాలు: 4. Called Michaiah, mother of Abijam and grandmother of Asa
4. Called Michaiah, mother of Abijam and grandmother of Asa గురించి వచనాలు
అతడు యెరూషలేములో నలభై ఒక్క సంవత్సరాలు పరిపాలించాడు. అబీషాలోము కుమార్తె మయకా అతని అవ్వ.
ఆసా తన పితరుడైన దావీదువలె యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు.
క్షేత్రాల్లోని మగ వ్యభిచారులను దేశం నుండి వెళ్లగొట్టాడు, అతని పూర్వికులు చేసిన విగ్రహాలన్నిటిని తొలగించాడు.
అతని అవ్వ మయకా అషేరాను పూజించడానికి ఒక అసహ్యమైన ప్రతిమను చేయించింది కాబట్టి ఆమెను రాజమాత స్థానం నుండి తొలగించాడు. ఆసా ఆ ప్రతిమను కూలగొట్టి, కిద్రోను లోయలో దానిని తగలబెట్టాడు.
ఆ తర్వాత అతడు అబ్షాలోము కుమార్తె మయకాను పెళ్ళి చేసుకున్నాడు. ఆమె ద్వారా అతనికి అబీయా, అత్తయి, జీజా, షెలోమీతు పుట్టారు.
రెహబాముకు పద్దెనిమిది మంది భార్యలు, అరవైమంది ఉంపుడుగత్తెలు ఉన్నారు. ఇరవై ఎనిమిది మంది కుమారులు, అరవైమంది కుమార్తెలు పుట్టారు. తన భార్యలందరిలో, ఉంపుడుగత్తెలందరిలో అబ్షాలోము కుమార్తె మయకా అంటే రెహబాముకు ఎక్కువ ప్రేమ.
మయకా కుమారుడైన అబీయాను రాజుగా చేయాలనుకొని, రెహబాము అతన్ని తన సోదరులపైన ప్రముఖునిగా నాయకునిగా నియమించాడు.
రెహబాము వివేకంతో ప్రవర్తిస్తూ, తక్కిన తన కుమారులను యూదాలో, బెన్యామీనులో వేరు ప్రాంతాలకు, కోటగోడలు గల పట్టణాలకు పంపాడు. వారికి విస్తారమైన ధనం ఇచ్చి వారికి అనేక పెళ్ళిళ్ళు చేశాడు.