Skip to content

Land గురించి బైబిల్ వచనాలు: Bought and sold

24 వచనాలు · 14 కోణాలు

Bought and sold గురించి వచనాలు

  1. తర్వాత అబ్రాహాము చనిపోయిన తన భార్య మృతదేహం దగ్గర నుండి లేచి హిత్తీయులతో మాట్లాడుతూ,

  2. “నేను మీ మధ్య విదేశీయునిగా, అపరిచితునిగా ఉన్నాను. చనిపోయిన నా భార్యను పాతిపెట్టడానికి నాకు కొంత భూమి అమ్మండి” అని అన్నాడు.

  3. హిత్తీయులు అబ్రాహాముకు జవాబిస్తూ,

  4. “అయ్యా, మేము చెప్పేది వినండి, మీరు మా మధ్య దేవుని రాజకుమారునిలా ఉన్నారు. సమాధి స్థలాల్లో మీకు నచ్చిన దానిలో మీరు పాతిపెట్టండి. మాలో ఎవ్వరూ మిమ్మల్ని ఆపరు” అన్నారు.

  5. అప్పుడు అబ్రాహాము లేచి ఆ దేశ ప్రజలైన హిత్తీయుల ఎదుట తలవంచాడు.

  6. వారితో ఇలా అన్నాడు, “మీరు నా భార్య మృతదేహాన్ని పాతిపెట్టడానికి సమ్మతిస్తే, సోహరు కుమారుడైన ఎఫ్రోనుకు చెందిన పొలం చివర మక్పేలా గుహ ఉంది, నా తరపున అతనితో మాట్లాడి, ఆ స్థలం నాకు మీ మధ్యలో ఉండే సమాధి స్థలంగా పూర్తి వెలకు అమ్ముమని అడగండి.”

  7. That he may give me the cave of Machpelah, which he hath, which is in the end of his field; for as much money as it is worth he shall give it me for a possession of a buryingplace amongst you.

  8. హిత్తీయుడైన ఎఫ్రోను అక్కడే తన ప్రజలమధ్య కూర్చుని, పట్టణ గవినికి వచ్చిన హిత్తీయులందరి సమక్షంలో అబ్రాహాముకు ఇలా జవాబిచ్చాడు.

  9. “నా ప్రభువా, అలా కాదు, నా మాట వినండి; ప్రజలందరి సమక్షంలో నేను పొలాన్ని ఇస్తాను, అందులోని గుహను ఇస్తాను. మీరు పాతి పెట్టుకోండి.”

  10. మళ్ళీ అబ్రాహాము ఆ దేశ ప్రజలందరి ఎదుట తలవంచాడు,

  11. అతడు ఆ దేశ ప్రజలందరూ వినేలా ఎఫ్రోనుతో, “నా మాట విను, పొలం యొక్క వెల నేను చెల్లిస్తాను. నా భార్య మృతదేహాన్ని అక్కడ నేను పాతిపెట్టేలా నా నుండి అది అంగీకరించు” అన్నాడు.

  12. ఎఫ్రోను అబ్రాహాముకు జవాబిస్తూ, “నా ప్రభువా, మా మాట వినండి; దాని ఖరీదు నాలుగు వందల షెకెళ్ళ వెండి, అయితే నాకు మీకు మధ్య అదెంత? మీ భార్య మృతదేహాన్ని పాతిపెట్టండి” అన్నాడు.

  13. My lord, hearken unto me: the land is worth four hundred shekels of silver; what is that betwixt me and thee? bury therefore thy dead.

  14. అబ్రాహాము ఎఫ్రోను చెప్పినట్టే ఒప్పుకుని, హిత్తీయుల వినికిడిలో వ్యాపారుల కొలత ప్రకారం నాలుగు వందల షెకెళ్ళ వెండి తూచి అతనికి ఇచ్చాడు.

  15. మమ్రే దగ్గర మక్పేలాలో ఉన్న ఎఫ్రోను పొలం అందులో ఉన్న గుహ ఆ పొలం సరిహద్దులో ఉన్న అన్ని చెట్లు

  16. పట్టణ గవిని దగ్గర ఉన్న హిత్తీయుల సమక్షంలో అబ్రాహాము పేర దస్తావేజు చేయబడింది.

  17. అననీయ అనేవాడు తన భార్యయైన సప్పీరాతో కలిసి తన పొలాన్ని అమ్మాడు.

  18. అతడు తన భార్యకు తెలిసే ఆ అమ్మిన డబ్బు నుండి కొంత దాచుకొని, మిగిలిన దానిని తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు.

  19. అప్పుడు పేతురు, “అననీయా, పొలాన్ని అమ్మిన డబ్బులో కొంత నీవు దాచుకొని పరిశుద్ధాత్మతో అబద్ధమాడడానికి ఎలా సాతాను నీ హృదయాన్ని ప్రేరేపించాడు?

  20. అమ్మక ముందు అది నీదే కాదా? దానిని అమ్మిన తర్వాత ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! అలాంటప్పుడు ఇలాంటి పని చేయాలని నీవు ఎలా ఆలోచించావు? నీవు మనుష్యులతో కాదు కాని దేవునితోనే అబద్ధమాడావు” అన్నాడు.

  21. అననీయ ఆ మాటలు విని, వెంటనే క్రిందపడి చనిపోయాడు. జరిగిన విషయాన్ని విన్నవారందరిలో గొప్ప భయం పుట్టింది.

  22. అప్పుడు కొంతమంది యువకులు వచ్చి, అతని శరీరాన్ని బట్టలతో చుట్టి, మోసుకువెళ్లి పాతిపెట్టారు.

  23. మూడు గంటల తర్వాత, జరిగిన సంగతి తెలియని అతని భార్య లోపలికి వచ్చింది.

  24. పేతురు ఆమెను, “నీవు అననీయ కలిసి ఆ పొలాన్ని ఇంతకే అమ్మారా? నాకు చెప్పు” అని అడిగాడు. అందుకు ఆమె, “అవును, ఇంతకే అమ్మాము” అని జవాబిచ్చింది.