కంటెంట్‌కు వెళ్లండి

Heart గురించి బైబిల్ వచనాలు: Unclassified scriptures descriptive of the seat of the affections

13 వచనాలు · 2 కోణాలు

Unclassified scriptures descriptive of the seat of the affections గురించి వచనాలు

  1. మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో, మీ పూర్ణబలంతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి.

  2. ఈ రోజు నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలు మీ హృదయాల్లో నిలిచి ఉండాలి.

  3. హృదయంలో ఆనందం ముఖాన్ని వికసింపజేస్తుంది, మనోవేదన ఆత్మను కృంగదీస్తుంది.

  4. వివేకంగల హృదయం తెలివిని వెదకుతుంది, కాని బుద్ధిహీనునికి మూర్ఖత్వమే ఆహారము.

  5. బాధింపబడుచున్న వారి రోజులన్నీ బాధాకరమే, కాని సంతోష హృదయం గలవారికి ఎప్పుడూ విందే.

  6. హృదయం అన్నిటికంటే మోసకరమైనది నయం చేయలేని వ్యాధి కలది. దాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు?

  7. “యెహోవానైన నేను హృదయాన్ని పరిశోధించి మనస్సును పరీక్షించి, ప్రతి వ్యక్తికి వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియలకు తగిన ప్రతిఫలమిస్తాను.”

  8. కానీ వ్యక్తి నోటి నుండి వచ్చేవన్ని హృదయంలోనుండి వస్తాయి. ఇవే వారిని అపవిత్రపరుస్తాయి.

  9. ఎందుకంటే, హృదయంలో నుండే నరహత్య, వ్యభిచారం, లైంగిక అనైతికత, దొంగతనం, అబద్ధసాక్ష్యం దూషణ అనే చెడ్డ ఆలోచనలు వస్తాయి.

  10. ఇవే వ్యక్తిని అపవిత్రపరుస్తాయి; అంతేకాని చేతులు కడక్కుండా భోజనం చేస్తే అది వారిని అపవిత్రపరచదు” అని చెప్పారు.

  11. ధర్మశాస్త్రం లేని యూదేతరులు స్వతహాగా ధర్మశాస్త్రానికి సంబంధించిన పనులు చేస్తే, వారు ధర్మశాస్త్రం లేనివారైనప్పటికీ, తమకు తామే ధర్మశాస్త్రంగా ఉన్నారు.

  12. ధర్మశాస్త్ర సారం తమ హృదయాల మీద రాసి ఉన్నట్లుగా వారు చూపిస్తారు. అలాంటివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిస్తుంది. వారి ఆలోచనలు కొన్ని సమయాల్లో వారిని నిందిస్తాయి మరికొన్ని సమయాల్లో వారిని కాపాడతాయి.

  13. నా సువార్తలో చెప్పిన ప్రకారం, దేవుడు యేసు క్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యాలను తీర్పు తీర్చే దినాన ఇలా జరుగుతుంది.