Skip to content

Fool గురించి బైబిల్ వచనాలు

36 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. బుద్ధిహీనుని నోట సామెత, మత్తుడైన వాని చేతిలో ముల్లు గుచ్చుకొన్నట్లుండును.

  2. యాదృచ్ఛికంగా గాయపడిన విలుకాడు వలె బుద్ధిహీనుని వలన కలుగు లాభము నిలువదు కూలికి వానిని పిలిచిన వాడును చెడిపోవును.

  3. తన మూర్ఖత్వాన్ని మరల కనుపరచు బుద్ధిహీనుడు తను కక్కిన దానికి తిరిగిన కుక్క వంటివాడు.

  4. తన కళ్లకు తాను జ్ఞానియైన వాన్ని చూశావా? వానికన్నా బుద్ధిహీనునికి ఎక్కువ నిరీక్షణ.

  5. ఒకవేళ లొంగదీయక ముందే పాము కాటేస్తే, పాములు ఆడించేవానికి లాభం ఉండదు.

  6. జ్ఞానుల నోటి నుండి వచ్చే మాటలు దయగలవి, కాని మూర్ఖుని పెదవులు వానినే మ్రింగివేస్తాయి.

  7. అవివేకంతో మొదలైన వారి మాటలు; దుర్మార్గపు వెర్రితనంతో ముగుస్తాయి;

  8. అయినా మూర్ఖులు వాగుతూనే ఉంటారు. ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు వారు చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో ఎవరు చెప్పగలరు?

  9. మూర్ఖులకు పట్టణానికి వెళ్లడానికి దారి తెలియదు; కాబట్టి తమ శ్రమతో వారు అలసిపోతారు.

  10. అయితే నా మాటలు విని వాటి ప్రకారం చేయనివారు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న తెలివిలేనివారిని పోలినవారు.

  11. వాన కురిసి వరదలు వచ్చి గాలులు వీచి ఆ ఇంటిని తాకాయి. అప్పుడు పెద్ద శబ్దంతో అది కూలిపోయింది.”