Skip to content

Firstborn గురించి బైబిల్ వచనాలు

32 వచనాలు · 5 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ప్రతి గర్భం యొక్క మొదటి సంతానాన్ని మీరు యెహోవాకు వేరుగా ఉంచాలి. మీ పశువుల మొదటి మగపిల్లలు యెహోవాకు చెందుతాయి.

  2. ప్రతి మొదటి సంతానమైన గాడిదను గొర్రెపిల్లతో విడిపించాలి, కాని ఒకవేళ దానిని విడిపించకపోతే, దాని మెడ విరిచివేయాలి. మీ కుమారులలో మనుష్యుల ప్రతి మొదటి మగ సంతానాన్ని విడిపించుకోవాలి.

  3. “భవిష్యత్తులో మీ కుమారుడు, ‘దీని అర్థమేంటి?’ అని మిమ్మల్ని అడిగినప్పుడు, మీరు వానితో ఇలా చెప్పాలి, ‘బలమైన హస్తంతో యెహోవా బానిస దేశమైన ఈజిప్టు నుండి మమ్మల్ని బయటకు రప్పించారు.

  4. ఫరో మమ్మల్ని వెళ్లనివ్వకుండా తన మనస్సు కఠినం చేసుకుని నిరాకరించినప్పుడు, యెహోవా ఈజిప్టులో ఉన్న మనుష్యుల, పశువుల మొదటి సంతానమంతటిని చంపేశారు. ఆ కారణంగానే ప్రతి గర్భం యొక్క మొదటి మగ పిల్లను యెహోవాకు బలి ఇచ్చి, నా కుమారులలో ప్రతి మొదటి సంతానాన్ని విడిపించుకుంటాను.’

  5. యెహోవా తన బలమైన హస్తంతో మమ్మల్ని ఈజిప్టులో నుండి బయటకు రప్పించారు అనడానికి ఇది మీ చేతి మీద ఒక గుర్తుగా మీ నుదుటి మీద ఒక ముద్రగా ఉంటుంది.”

  6. “మీ ధాన్యాగారాల నుండి, తొట్టెల నుండి అర్పణలు చెల్లించడం ఆలస్యం చేయకూడదు. “ఖచ్చితంగా మీ కుమారులలో మొదటి సంతానాన్ని నాకు అర్పించాలి.

  7. మీ పశువులు గొర్రెల విషయంలో కూడా అలాగే చేయాలి. వాటిని తల్లి దగ్గర ఏడు రోజుల వరకు ఉంచాలి. ఎనిమిదవ రోజున వాటిని నాకు ఇవ్వాలి.

  8. “ప్రతి గర్భం యొక్క మొదటి సంతానం నాదే, మీ పశువుల్లో మొదటి సంతానమైన ప్రతి మగపిల్ల అది దూడ గాని, గొర్రెపిల్ల గాని, అది నాకు చెందుతుంది.

  9. గొర్రెపిల్లను ఇచ్చి మొదటి సంతానమైన గాడిదను విడిపించుకోవాలి, అలా మీరు దాన్ని విడిపించుకోకపోతే, దాని మెడ విరగ్గొట్టాలి. మీ ప్రతి మొదటి మగపిల్లవాన్ని విడిపించుకోవాలి. “నా సన్నిధిలో ఎవరూ వట్టి చేతులతో కనిపించకూడదు.

  10. యెహోవా మోషేతో, “ఒక నెల లేదా ఆపై వయస్సున్న ఇశ్రాయేలీయుల తొలిసంతానమైన మగవారిని లెక్కించండి, వారి పేర్ల జాబితాను తయారుచేయండి.

  11. ఇశ్రాయేలీయుల్లోని తొలిసంతానానికి బదులు లేవీయులను, ఇశ్రాయేలీయుల పశువుల్లో తొలిసంతానానికి బదులు లేవీయుల పశువులను నా కోసం తీసుకోవాలి. నేను యెహోవానై యున్నాను.”

  12. కాబట్టి మోషే యెహోవా ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలీయులలో తొలిసంతానాన్ని లెక్కించాడు.

  13. ఒక నెల లేదా ఆ పైబడి వయస్సుగల మొదటి సంతానమైన మగవారందరు 22,273 మంది.

  14. యెహోవా మోషేకు ఇలా కూడా చెప్పారు.

  15. “ఇశ్రాయేలీయుల తొలి సంతానమంతటికి బదులు లేవీయులను, వారి పశువుల్లో తొలిసంతానానికి బదులు లేవీయుల పశువులను నా కోసం తీసుకో. లేవీయులు నా వారిగా ఉండాలి. నేనే యెహోవాను.

  16. లేవీయుల కంటే ఇశ్రాయేలీయులు 273 మంది ఎక్కువ ఉన్నారు. వీరిని విడిపించడానికి,

  17. పరిశుద్ధాలయం యొక్క షెకెల్ చొప్పున, ఒక్క షెకెల్ అంటే ఇరవై గెరాలు, ఒక్కొక్కరికి అయిదు షెకెళ్ళ వెండి తీసుకోవాలి.

  18. ఆ మిగిలిన ఇశ్రాయేలీయుల విమోచన కోసం అహరోనుకు అతని కుమారులకు ఆ డబ్బు ఇవ్వాలి.”

  19. కాబట్టి మోషే లేవీయుల ద్వారా విడిపించబడిన వారికంటే ఎక్కువగా ఉన్న వారి నుండి విమోచన డబ్బు తీసుకున్నాడు.

  20. ఇశ్రాయేలీయులలో తొలిసంతానం నుండి పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం మోషే 1,365 షెకెళ్ళ వెండి తీసుకున్నాడు.

  21. యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మోషే విమోచన డబ్బును అహరోను అతని కుమారులకు ఇచ్చాడు.

  22. వీరు ఇశ్రాయేలీయులలో నుండి సంపూర్ణంగా ఇవ్వబడాల్సిన లేవీయులు. ప్రతి ఇశ్రాయేలు స్త్రీ యొక్క మొదటి మగ సంతానానికి బదులు వీరిని నా సొంతవారిగా తీసుకున్నాను.

  23. ఇశ్రాయేలులో మనుష్యుల్లోను పశువుల్లోను ప్రతి తొలిచూలు మగ సంతతి నాదే. ఈజిప్టులో జ్యేష్ఠ సంతతిని మొత్తాను కాబట్టి వీరిని నాకు నేను ప్రత్యేకపరచుకున్నాను.

  24. ఇశ్రాయేలులో జ్యేష్ఠులైన మగవారికి ప్రత్యామ్నాయంగా నేను లేవీయులను ఏర్పరచుకున్నాను.

  25. ప్రతి గర్భం నుండి వచ్చిన యెహోవాకు అర్పించబడ్డ జ్యేష్ఠ సంతానం, మనుష్యులైన, జంతువులైన, మీకు చెందుతాయి. కానీ మీరు ప్రతి పెద్ద కుమారున్ని, అపవిత్ర జంతువుల తొలిచూలును విడిపించాలి.