కంటెంట్‌కు వెళ్లండి

Firstborn గురించి బైబిల్ వచనాలు: Of man and beast, reserved to Himself by God

16 వచనాలు · 5 కోణాలు

Of man and beast, reserved to Himself by God గురించి వచనాలు

  1. ప్రతి గర్భం యొక్క మొదటి సంతానాన్ని మీరు యెహోవాకు వేరుగా ఉంచాలి. మీ పశువుల మొదటి మగపిల్లలు యెహోవాకు చెందుతాయి.

  2. ప్రతి మొదటి సంతానమైన గాడిదను గొర్రెపిల్లతో విడిపించాలి, కాని ఒకవేళ దానిని విడిపించకపోతే, దాని మెడ విరిచివేయాలి. మీ కుమారులలో మనుష్యుల ప్రతి మొదటి మగ సంతానాన్ని విడిపించుకోవాలి.

  3. “భవిష్యత్తులో మీ కుమారుడు, ‘దీని అర్థమేంటి?’ అని మిమ్మల్ని అడిగినప్పుడు, మీరు వానితో ఇలా చెప్పాలి, ‘బలమైన హస్తంతో యెహోవా బానిస దేశమైన ఈజిప్టు నుండి మమ్మల్ని బయటకు రప్పించారు.

  4. ఫరో మమ్మల్ని వెళ్లనివ్వకుండా తన మనస్సు కఠినం చేసుకుని నిరాకరించినప్పుడు, యెహోవా ఈజిప్టులో ఉన్న మనుష్యుల, పశువుల మొదటి సంతానమంతటిని చంపేశారు. ఆ కారణంగానే ప్రతి గర్భం యొక్క మొదటి మగ పిల్లను యెహోవాకు బలి ఇచ్చి, నా కుమారులలో ప్రతి మొదటి సంతానాన్ని విడిపించుకుంటాను.’

  5. యెహోవా తన బలమైన హస్తంతో మమ్మల్ని ఈజిప్టులో నుండి బయటకు రప్పించారు అనడానికి ఇది మీ చేతి మీద ఒక గుర్తుగా మీ నుదుటి మీద ఒక ముద్రగా ఉంటుంది.”

  6. “మీ ధాన్యాగారాల నుండి, తొట్టెల నుండి అర్పణలు చెల్లించడం ఆలస్యం చేయకూడదు. “ఖచ్చితంగా మీ కుమారులలో మొదటి సంతానాన్ని నాకు అర్పించాలి.

  7. మీ పశువులు గొర్రెల విషయంలో కూడా అలాగే చేయాలి. వాటిని తల్లి దగ్గర ఏడు రోజుల వరకు ఉంచాలి. ఎనిమిదవ రోజున వాటిని నాకు ఇవ్వాలి.

  8. “ప్రతి గర్భం యొక్క మొదటి సంతానం నాదే, మీ పశువుల్లో మొదటి సంతానమైన ప్రతి మగపిల్ల అది దూడ గాని, గొర్రెపిల్ల గాని, అది నాకు చెందుతుంది.

  9. గొర్రెపిల్లను ఇచ్చి మొదటి సంతానమైన గాడిదను విడిపించుకోవాలి, అలా మీరు దాన్ని విడిపించుకోకపోతే, దాని మెడ విరగ్గొట్టాలి. మీ ప్రతి మొదటి మగపిల్లవాన్ని విడిపించుకోవాలి. “నా సన్నిధిలో ఎవరూ వట్టి చేతులతో కనిపించకూడదు.

  10. ఇశ్రాయేలులో మనుష్యుల్లోను పశువుల్లోను ప్రతి తొలిచూలు మగ సంతతి నాదే. ఈజిప్టులో జ్యేష్ఠ సంతతిని మొత్తాను కాబట్టి వీరిని నాకు నేను ప్రత్యేకపరచుకున్నాను.

  11. ఇశ్రాయేలులో జ్యేష్ఠులైన మగవారికి ప్రత్యామ్నాయంగా నేను లేవీయులను ఏర్పరచుకున్నాను.

  12. పశువుల మందలో మొదట పుట్టిన ప్రతి మగదానిని మీ దేవుడైన యెహోవా కోసం పవిత్రపరచాలి. మీ ఎద్దులలో మొదట పుట్టిన దానితో పని చేయించకూడదు, గొర్రెలలో మొదట పుట్టిన దాని బొచ్చు కత్తిరించకూడదు.

  13. యెహోవా ఏర్పరచుకున్న స్థలంలో మీ దేవుడైన యెహోవా సన్నిధిలో ప్రతి సంవత్సరం మీరు మీ కుటుంబం వాటిని తినాలి.

  14. ఆ జంతువుల్లో లోపం అంటే అది కుంటిదైనా గ్రుడ్డిదైనా లేదా వేరే ఏదైన లోపం ఉంటే మీరు దానిని మీ దేవుడైన యెహోవాకు అర్పించకూడదు.

  15. మీరు దానిని మీ సొంత పట్టణాల్లోనే తినాలి. జింకను దుప్పిని తిన్నట్లు ఆచారరీత్య పవిత్రులు, అపవిత్రులు, ఇద్దరు దానిని తినవచ్చు.

  16. అయితే మీరు రక్తాన్ని తినకూడదు; దానిని నీళ్లవలె నేలమీద పారవేయాలి.