కంటెంట్‌కు వెళ్లండి

Fear of God గురించి బైబిల్ వచనాలు: Cultivated

9 వచనాలు · 2 కోణాలు

"Fear of God" కోసం వెతకండి

Cultivated గురించి వచనాలు

  1. నీవు పర్వతం చుట్టూ ప్రజలకు సరిహద్దు ఏర్పాటు చేసి ప్రజలతో, ‘మీరు ఎవరు పర్వతం దగ్గరకు రాకూడదు దాని అంచును తాకకూడదు. ఎవరైనా ఆ పర్వతాన్ని తాకితే వారు చంపబడతారు.

  2. ఎవరైనా తమ చేతులతో ముట్టుకుంటే వారు బాణాలతో గుచ్చబడి లేదా రాళ్లతో కొట్టబడి చంపబడాలి; తాకింది మనిషైనా ఒక జంతువైనా చంపబడాలి’ అని చెప్పాలి. పొట్టేలు కొమ్ము బూర శబ్దం సుదీర్ఘంగా విన్నప్పుడు వారు పర్వతం దగ్గరకు రావాలి” అని చెప్పారు.

  3. తాకగల పర్వతం దగ్గరకు మీరు రాలేదు అది అగ్నితో మండుతుంది; చీకటి, కారు మబ్బు, తుఫాను;

  4. ఒక బూర శబ్దం లేదా అలాంటి గంభీరస్వరంతో మాట్లాడే చోటుకు మీరు రాలేదు. ఆ స్వరం యొక్క మాటలు విన్న వారు తమతో ఇంకొక్క మాట మాట్లాడకూడదని బ్రతిమాలుకొన్నారు,

  5. “ఒకవేళ ఒక జంతువైనా ఆ పర్వతాన్ని తాకితే, రాళ్లతో కొట్టబడి చంపబడాలి” అని ఇవ్వబడిన ఆజ్ఞను వారు భరించలేకపోయారు.

  6. ఆ దృశ్యం చాలా భయానకం కాబట్టి మోషే, “నేను భయంతో వణుకుతున్నాను” అన్నాడు.

  7. అయితే మీరు సీయోను పర్వతానికి, సజీవ దేవుని పట్టణమైన పరలోకపు యెరూషలేముకు వచ్చారు. మీరు సంతోషకరమైన సభలో వేలాదిమంది దేవదూతల దగ్గరకు వచ్చారు.

  8. పరలోకంలో పేర్లు వ్రాయబడి ఉన్న దేవుని జ్యేష్ఠ సంతానమనే సంఘానికి మీరు వచ్చారు. మనుష్యులందరికి న్యాయాధిపతియైన దేవుని దగ్గరకు, నిర్దోషులుగా తీర్చబడిన నీతిమంతుల్లా పరిపూర్ణత పొందిన ఆత్మల దగ్గరకు మీరు వచ్చారు.

  9. క్రొత్త నిబంధనకు మధ్యవర్తియైన యేసు దగ్గరకు, హేబెలు రక్తంకంటే ఉత్తమంగా మాట్లాడే చిందించబడిన రక్తం దగ్గరకు మీరు వచ్చారు.