కంటెంట్‌కు వెళ్లండి

Disobedience to God గురించి బైబిల్ వచనాలు

106 వచనాలు · 21 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నీవు భోజనం గాని నీళ్లు గాని తీసుకోవద్దు అని ఆయన ఏ స్థలాన్ని గురించి ఆజ్ఞాపించారో, ఆ స్థలంలో నీవు భోజనం, నీళ్లు తీసుకున్నావు. కాబట్టి నీ శవం నీ పూర్వికుల సమాధిలో పాతిపెట్టబడదు’ ” అని చెప్పాడు.

  2. దైవజనుడు భోజనం చేసి నీళ్లు త్రాగిన తర్వాత, అతన్ని తీసుకువచ్చిన ప్రవక్త అతని కోసం గాడిద మీద జీను వేశాడు.

  3. రాజైన హిజ్కియా పరిపాలన యొక్క నాలుగవ సంవత్సరంలో, ఇశ్రాయేలు రాజు, ఏలా కుమారుడైన హోషేయ పరిపాలన యొక్క ఏడవ సంవత్సరంలో, అష్షూరు రాజైన షల్మనేసెరు సమరయ మీదికి దండెత్తి దాన్ని ముట్టడించాడు.

  4. మూడు సంవత్సరాల ముగింపులో అష్షూరీయులు దాన్ని చేజిక్కించుకున్నారు. కాబట్టి హిజ్కియా పరిపాలన యొక్క ఆరవ సంవత్సరంలో, ఇశ్రాయేలు రాజైన హోషేయ పరిపాలన యొక్క తొమ్మిదవ సంవత్సరంలో సమరయ స్వాధీనపరచుకోబడింది.

  5. అష్షూరు రాజు ఇశ్రాయేలును చెరగా తీసుకెళ్లి, హాలహులో, హాబోరు నది ప్రాంతంలో ఉన్న గోజానులో, మాదీయుల పట్టణాల్లో వారిని ఉంచాడు.

  6. వారు తమ దేవుడైన యెహోవా చెప్పిన మాట వినకుండా, ఆయన నిబంధనను, యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించిందంతటిని ఉల్లంఘించినందుకు ఇలా జరిగింది. వారు ఆజ్ఞలను వినలేదు, పాటించలేదు.