Skip to content

Dancing గురించి బైబిల్ వచనాలు: General references

9 వచనాలు · 3 కోణాలు

General references గురించి వచనాలు

  1. అయితే చూడండి, షిలోహులో యెహోవాకు సంవత్సర పండుగ జరుగుతుంది; షిలోహు బేతేలుకు ఉత్తరాన, బేతేలు నుండి షెకెముకు వెళ్లే దారికి తూర్పున, లెబోనాకు దక్షిణాన ఉన్న షిలోహులో యెహోవాకు సంవత్సర పండుగ జరుగుతుంది” అని అన్నారు.

  2. అప్పుడు వారు బెన్యామీనీయులను ఇలా ఆదేశించారు: “అక్కడికి వెళ్లి ద్రాక్షతోటల్లో దాక్కుని

  3. వేచి ఉండండి. షిలోహు నుండి యువతులు నాట్యంలో పాల్గొనడానికి వస్తున్నప్పుడు, మీరు ద్రాక్షతోటల్లో నుండి త్వరగా వచ్చి, ప్రతివాడును షిలోహు యువతులలో ఒక యువతిని పెళ్ళి చేసుకోడానికి తీసుకెళ్లండి. తర్వాత బెన్యామీను ప్రదేశానికి తిరిగి వెళ్లండి.

  4. దావీదు సన్నని నారతో నేసిన ఏఫోదును ధరించి తన శక్తంతటితో యెహోవా సన్నిధిలో నాట్యం చేశాడు.

  5. ఇలా దావీదు, ఇశ్రాయేలీయులందరు ఆనందోత్సాహాలతో బూరల ధ్వనితో యెహోవా మందసాన్ని తీసుకువచ్చారు.

  6. యెహోవా నిబంధన మందసం దావీదు పట్టణంలోనికి వస్తుండగా, సౌలు కుమార్తె మీకాలు కిటికీలో నుండి చూసింది. యెహోవా సన్నిధిలో రాజైన దావీదు గంతులు వేస్తూ నాట్యం చేయడం చూసి తన మనస్సులో అతన్ని నీచంగా చూసింది.

  7. ఒక క్రొవ్విన దూడను తెచ్చి వధించండి. మనం విందు చేసుకుని ఆనందిద్దాము.

  8. ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు, వీడు తప్పిపోయి దొరికాడు’ అని అన్నాడు. అలా వారందరు అతనితో ఆనందించడం మొదలుపెట్టారు.

  9. “ఆ సమయంలో, పెద్ద కుమారుడు పొలం నుండి ఇంటికి వస్తున్నాడు. అతడు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు, సంగీత నాట్యాల ధ్వని వినిపించింది.