కంటెంట్‌కు వెళ్లండి

Christian Conduct గురించి బైబిల్ వచనాలు: Fulfilling domestic duties

15 వచనాలు · 48 కోణాలు

Fulfilling domestic duties గురించి వచనాలు

  1. పిల్లలారా, ప్రభువులో మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, అది సరియైనది.

  2. “మీ తండ్రిని తల్లిని గౌరవించాలి, ఇది వాగ్దానంతో కూడిన మొదటి ఆజ్ఞ.

  3. దాని వలన మీకు మేలు కలుగుతుంది, మీరు సంతోషంగా భూమి మీద దీర్ఘాయువు కలిగి జీవిస్తారు.”

  4. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపకుండా ప్రభువు బోధలో క్రమశిక్షణలో వారిని పెంచండి.

  5. దాసులారా, మీరు క్రీస్తుకు లోబడినట్టు ఈ లోకసంబంధమైన మీ యజమానులకు గౌరవంతో, యథార్థ హృదయం కలవారై భయంతో లోబడి ఉండండి.

  6. వారి కనుదృష్టి మీమీద ఉన్నప్పుడు వారి దయను పొందాలని కాకుండా, క్రీస్తు దాసులుగా, దేవుని చిత్తాన్ని హృదయపూర్వకంగా చేస్తూ వారికి లోబడండి.

  7. మనష్యులకు చేసినట్లు కాక, ప్రభువును సేవించినట్లే హృదయపూర్వకంగా సేవ చేయండి.

  8. ఎందుకంటే, దాసులైనా, స్వతంత్రులైనా మీలో ప్రతివారు ఏ మంచి కార్యాన్ని చేస్తారో దాని ఫలాన్ని ప్రభువు నుండి పొందుతారని మీకు తెలుసు.

  9. అలాగే భార్యలారా, మీరు మీ భర్తలకు లోబడి ఉండండి. ఒకవేళ వారిలో ఎవరైనా దేవుని వాక్యాన్ని అంగీకరించనివారు ఉంటే, మీరు ఒక్క మాట కూడా పలకాల్సిన అవసరం లేకుండానే మీ ప్రవర్తన వలన వారు విశ్వాసులు కాగలరు.

  10. ఎందుకంటే భయభక్తులతో, పరిశుద్ధతతో కూడిన మీ ప్రవర్తనను వారు గమనిస్తారు.

  11. తల వెంట్రుకలను అలంకరించుకోవడం, బంగారు ఆభరణాలను ధరించడం, విలువైన వస్త్రాలు వేసుకోవడం అనే బాహ్య సౌందర్యం వద్దు.

  12. మృదువైన, సాధు స్వభావమనే అక్షయమైన అలంకారం గల హృదయపు సౌందర్యాన్ని కలిగి ఉండాలి. అదే దేవుని దృష్టిలో అమూల్యమైనది.

  13. ఎలాగంటే, పూర్వకాలంలో పరిశుద్ధులైన స్త్రీలు దేవునిలో నిరీక్షణ ఉంచి ఇలా తమ సౌందర్యాన్ని పోషించుకుంటూ, తమ భర్తలకు లోబడి ఉన్నారు.

  14. అదే విధంగా శారా అబ్రాహాముకు లోబడి అతడిని యజమాని అని పిలిచింది. మీరు మంచి పనులు చేస్తూ దేనికి బెదరని వారైతే ఆమెకు పిల్లలవుతారు.

  15. అలాగే భర్తలారా మీరు, మీ భార్యలు జీవమనే కృపావరంలో మీతో జతపనివారై ఉన్నారని ఎరిగి బలహీనులైన మీ భార్యలను గౌరవిస్తూ వారితో కాపురం చేయండి. అప్పుడు మీ ప్రార్థనలకు ఆటంకం ఉండదు.