Amorites గురించి బైబిల్ వచనాలు: Judgments denounced against
Judgments denounced against గురించి వచనాలు
అందుకు యెహోవా: “నీతో నేను ఒక ఒడంబడిక చేస్తున్నాను. ఈ భూమి మీద ఏ దేశంలో ఎప్పుడూ జరుగని అద్భుతాలు నేను నీ ప్రజలందరి ఎదుట చేస్తాను. నీవు ఏ ప్రజలమధ్య నివసిస్తున్నావో వారందరు యెహోవానైన నేను మీ కోసం చేసే భయంకరమైన కార్యాన్ని చూస్తారు.
నేడు నేను మీకు ఆజ్ఞాపించే దానికి లోబడాలి. నేను అమోరీయులు, కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను నీ ఎదుట నుండి వెళ్లగొడతాను.
మీ దేవుడైన యెహోవా ఆజ్ఞమేరకు హిత్తీయులను, అమోరీయులను కనానీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను పూర్తిగా నాశనం చేయాలి.
లేకపోతే తమ దేవుళ్ళకు చేసే హేయ క్రియలను మీకు నేర్పుతారు, మీరు మీ దేవుడైన యెహోవాకు విరోధంగా పాపాలు చేస్తారు, అందుకే వారిని నిర్మూలించమని చెప్తున్నాను.