Agriculture or Husbandry గురించి బైబిల్ వచనాలు: Grafting
Grafting గురించి వచనాలు
అయితే ఒలీవచెట్టు కొమ్మల్లో కొన్ని విరిచివేయబడి, అడవి ఒలీవచెట్టు కొమ్మలాంటి నీవు మిగిలిన కొమ్మల మధ్యలో అంటుకట్టబడి, ఆ ఒలీవచెట్టు వేరు నుండి వచ్చే సారంలో పాలుపొందినప్పుడు,
మిగిలిన కొమ్మల కన్నా నీవు గొప్పవానిగా భావించవద్దు. నీవు అలా భావిస్తే, నీవు వేరుకు ఆధారం కాదు గాని వేరే నీకు ఆధారంగా ఉందని తెలుసుకో.
“నేను అంటుకట్టబడాలని ఆ కొమ్మలు విరిచివేయబడ్డాయి” అని నీవు చెప్పవచ్చు.
సహజంగా అడవి ఒలీవచెట్టు నుండి కోయబడిన కొమ్మవైన నీవే స్వభావానికి విరుద్ధంగా మంచి ఒలీవచెట్టుకు అంటుకట్టబడితే, సహజమైన కొమ్మలు మరింత సులభంగా వాటి సొంత ఒలీవచెట్టుకు అంటుకట్టబడతాయి గదా!