Abner గురించి బైబిల్ వచనాలు: Captain of the host
Captain of the host గురించి వచనాలు
సౌలు భార్యపేరు అహీనోయము. ఈమె అహిమయస్సు కుమార్తె. సౌలు సేనాధిపతి పేరు అబ్నేరు. అతడు నేరు కుమారుడు. నేరు సౌలు చిన్నాన్న.
దావీదు ఆ ఫిలిష్తీయుని ఎదుర్కోడానికి వెళ్లడం చూసి సౌలు తన సేనాధిపతియైన అబ్నేరును పిలిచి, “అబ్నేరూ, ఈ యువకుడు ఎవరి కుమారుడు” అని అడిగాడు. అందుకు అబ్నేరు, “రాజా, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నాకు తెలియదు” అన్నాడు.
తర్వాత దావీదు బయలుదేరి సౌలు బసచేసిన చోటికి వెళ్లి, సౌలు, సేనాధిపతియైన నేరు కుమారుడు అబ్నేరు ఎక్కడ పడుకున్నారో చూశాడు. సౌలు శిబిరం లోపల పడుకున్నాడు, సైన్యమంతా అతని చుట్టూ ఉంది.
దావీదు సైన్యాన్ని, నేరు కుమారుడైన అబ్నేరును పిలిచి, “అబ్నేరూ, నీవు నాకు జవాబివ్వవా?” అని అన్నాడు. అప్పుడు అబ్నేరు, “రాజును నిద్ర లేపుతున్న నీవు ఎవరివి?” అని అడిగాడు.