Skip to content

Ablution గురించి బైబిల్ వచనాలు: Of the hands

7 వచనాలు · 10 కోణాలు

Of the hands గురించి వచనాలు

  1. “కడుక్కోడానికి నీవు ఒక ఇత్తడి గంగాళాన్ని, దానికి ఇత్తడి పీటని చేసి సమావేశ గుడారానికి బలిపీఠానికి మధ్యలో పెట్టి దానిలో నీళ్లు పోయాలి.

  2. దానిలో ఉన్న నీళ్లతో అహరోను అతని కుమారులు తమ చేతులు పాదాలు కడుక్కోవాలి.

  3. వారు సమావేశ గుడారంలోకి వెళ్లినప్పుడెల్లా, వారు నీళ్లతో కడుక్కోవాలి, తద్వారా వారు చావరు. అలాగే, వారు యెహోవాకు హోమబలి అర్పించి సేవ చేయడానికి బలిపీఠాన్ని సమీపించినప్పుడు,

  4. తాము చనిపోకుండా ఉండడానికి వారు తమ చేతులు పాదాలు కడుక్కోవాలి. ఇది అహరోనుకు అతని కుమారులకు తర్వాతి తరాలకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది.”

  5. సమావేశ గుడారానికి బలిపీఠానికి మధ్యలో గంగాళాన్ని ఉంచి, కడుక్కోడానికి దానిలో నీళ్లు పోశాడు.

  6. మోషే అహరోను అతని కుమారులు తమ చేతులు కాళ్లు కడుక్కోడానికి దీనిని ఉపయోగించారు.

  7. వారు సమావేశ గుడారం లోనికి వెళ్లినప్పుడు బలిపీఠాన్ని సమీపించినప్పుడు కడుక్కునేవారు; యెహోవా మోషే ఆజ్ఞాపించిన ప్రకారం మోషే ఇది చేశాడు.