Abib గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
“ఈ నెల మీకు మొదటి నెల, ఇది మీ సంవత్సరానికి మొదటి నెల.
“పులియని రొట్టెల పండుగ జరుపుకోండి; నేను మీకు ఆజ్ఞాపించినట్లు ఏడు రోజులు పులియని రొట్టెలు తినాలి. అబీబు నెలలో నిర్ణీత సమయంలో ఇలా తినండి, ఎందుకంటే ఆ నెలలో మీరు ఈజిప్టు నుండి వచ్చారు. “నా సన్నిధిలో ఎవరూ వట్టి చేతులతో కనిపించకూడదు.
“మొదటి నెల మొదటి రోజున సమావేశ గుడారాన్ని నిలబెట్టాలి.
రెండవ సంవత్సరం మొదటి నెలలో మొదటి రోజున సమావేశ గుడారాన్ని నిలబెట్టారు.
సంవత్సరం మొదటి నెలలో ఇశ్రాయేలు సమాజమంతా సీను ఎడారికి చేరి కాదేషులో దిగారు. అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడింది.
అబీబు నెలను ఆచరించి మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగించాలి, ఎందుకంటే అబీబు నెలలో రాత్రివేళ మీ దేవుడైన యెహోవా ఈజిప్టులో నుండి మిమ్మల్ని తీసుకువచ్చారు.
మొదటి నెల పదవ రోజున ప్రజలు యొర్దాను నదిలో నుండి వచ్చి యెరికో తూర్పు సరిహద్దులోని గిల్గాలులో బస చేశారు.
యొర్దాను నది గట్లమీదుగా పొర్లి పారుతున్నప్పుడు, మొదటి నెలలో దానిని దాటి వెళ్లి లోయల్లో తూర్పు నుండి పడమర వరకు ఉన్నవారినందరిని తరిమివేసింది వీరే.