Abdon గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
ఆషేరు గోత్రం నుండి: మిషాలు, అబ్దోను,
అతని తర్వాత, పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడైన అబ్దోను ఇశ్రాయేలును నడిపించాడు.
అతనికి నలభైమంది కుమారులు, ముప్పైమంది మనుమలు ఉన్నారు. వారు డెబ్బై గాడిదల మీద స్వారీ చేసేవారు. అతడు ఎనిమిది సంవత్సరాలు ఇశ్రాయేలును నడిపించాడు.
తర్వాత హిల్లేలు కుమారుడైన అబ్దోను చనిపోయాడు. అమాలేకీయుల కొండసీమలో ఉన్న ఎఫ్రాయిం ప్రదేశంలోని పిరాతోనులో అతడు పాతిపెట్టబడ్డాడు.
తర్వాత రాజు యాజకుడైన హిల్కీయాకు, షాఫాను కుమారుడైన అహీకాముకు, మీకాయా కుమారుడైన అక్బోరుకు, కార్యదర్శియైన షాఫానుకు, రాజు సేవకుడైన అశాయాకు ఇలా ఆదేశాలు జారీ చేశాడు:
ఆషేరు గోత్ర ప్రదేశంలో నుండి మాషాలు, అబ్దోను,
అబ్దోను, జిఖ్రీ, హానాను,
అతని మొదటి కుమారుడు అబ్దోను. తర్వాత సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు,
అతని మొదటి కుమారుడు అబ్దోను, తర్వాత సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు,
తర్వాత రాజు హిల్కీయాకు, షాఫాను కుమారుడైన అహీకాముకు, మీకా కుమారుడైన అబ్దోనుకు, కార్యదర్శియైన షాఫానుకు, రాజు సేవకుడైన అశాయాకు ఇలా ఆదేశాలు జారీ చేశాడు: