కంటెంట్‌కు వెళ్లండి

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 వచనాలు · 4 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. లూకా 17:19సుమారు క్రీ.శ. 33

    ఆ తర్వాత వానితో, “నీవు లేచి వెళ్లు; నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది” అన్నారు.

  2. లూకా 17:20సుమారు క్రీ.శ. 33

    ఒకసారి పరిసయ్యులు దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందని యేసును అడిగినప్పుడు ఆయన, “దేవుని రాజ్యం పైకి కనిపించేదిగా రాదు,

  3. లూకా 17:21సుమారు క్రీ.శ. 33

    దేవుని రాజ్యం మీలోనే ఉంది కాబట్టి ‘ఇదిగో ఇక్కడ ఉంది’ లేదా ‘అదిగో అక్కడ ఉంది’ అని ఎవరు చెప్పలేరు” అని జవాబిచ్చారు.

  4. లూకా 17:22సుమారు క్రీ.శ. 33

    ఆ తర్వాత ఆయన తన శిష్యులతో, “మనుష్యకుమారుని దినాల్లోని ఒక రోజునైనా చూడాలని మీరు ఆశించే సమయం వస్తుంది, కాని మీరు ఆ రోజును చూడరు.

  5. లూకా 17:23సుమారు క్రీ.శ. 33

    ప్రజలు మీతో ‘అదిగో ఆయన అక్కడ ఉన్నాడు!’ లేదా ‘ఇదిగో ఆయన ఇక్కడ ఉన్నాడు!’ అని అంటారు. మీరు వారి వెనుక పరుగెత్తకండి.

  6. లూకా 17:24సుమారు క్రీ.శ. 33

    ఎందుకంటే మనుష్యకుమారుని రాకడ దినం ఆకాశంలో ఒక దిక్కునుండి మరో దిక్కువరకు మెరిసే మెరుపువలె ఉంటుంది.

  7. లూకా 17:25సుమారు క్రీ.శ. 33

    కానీ దానికి ముందు, ఆయన అనేక హింసలు పొందాలి ఈ తరం వారి చేత తిరస్కరించబడాలి.

  8. లూకా 17:26సుమారు క్రీ.శ. 33

    “నోవహు దినాల్లో జరిగినట్టు, మనుష్యకుమారుని దినాల్లో కూడా జరుగుతుంది.

  9. లూకా 17:27సుమారు క్రీ.శ. 33

    నోవహు ఓడలోనికి ప్రవేశించిన రోజు వరకు ప్రజలందరూ తింటూ, త్రాగుతూ, పెండ్లి చేసుకొంటూ, పెండ్లికిస్తూ ఉన్నారు. అప్పుడు జలప్రళయం వచ్చి వారందరిని నాశనం చేసింది.

  10. లూకా 17:28సుమారు క్రీ.శ. 33

    “లోతు దినాల్లో జరిగినట్టే జరుగుతుంది. ప్రజలు తింటూ త్రాగుతూ కొంటూ అమ్ముతూ మొక్కలు నాటుతూ, ఇళ్ళు కడుతున్నారు.

  11. లూకా 17:29సుమారు క్రీ.శ. 33

    కానీ లోతు సొదొమ గ్రామం విడిచి వెళ్లిన రోజునే ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిసి వారందరు నాశనం అయ్యారు.

  12. లూకా 17:30సుమారు క్రీ.శ. 33

    “మనుష్యకుమారుడు ప్రత్యక్షమయ్యే రోజు కూడా అలాగే ఉంటుంది.

  13. లూకా 17:31సుమారు క్రీ.శ. 33

    ఆ రోజు ఇంటిపైన ఉన్నవారెవరు ఇంట్లోనుండి తమ వస్తువులను తెచ్చుకోవడానికి క్రిందికి దిగి వెళ్లకూడదు. అలాగే పొలంలో ఉన్నవారు ఏమైనా తెచ్చుకోడానికి తిరిగి వెనుకకు వెళ్లకూడదు.

  14. లూకా 17:32సుమారు క్రీ.శ. 33

    లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి.

  15. లూకా 17:33సుమారు క్రీ.శ. 33

    తన ప్రాణాన్ని కాపాడుకోవాలని చూసేవారు దాన్ని పోగొట్టుకుంటారు, తన ప్రాణాన్ని పోగొట్టుకునేవారు దాన్ని కాపాడుకుంటారు.

  16. లూకా 17:34సుమారు క్రీ.శ. 33

    ఆ రాత్రి ఒకే పరుపు మీద ఉన్న ఇద్దరిలో, ఒకరు కొనిపోబడతారు ఇంకొకరు విడవబడతారు.

  17. లూకా 17:35సుమారు క్రీ.శ. 33

    ఇద్దరు స్త్రీలు కలిసి తిరుగలి విసురుతుంటారు; ఒక స్త్రీ కొనిపోబడుతుంది, ఇంకొక స్త్రీ విడవబడుతుంది.

  18. లూకా 17:36సుమారు క్రీ.శ. 33

    ఆ సమయంలో ఇద్దరు పొలంలో ఉంటారు; ఒకడు కొనిపోబడతాడు మరొకడు విడవబడుతాడు” అని చెప్పారు.

  19. లూకా 17:37సుమారు క్రీ.శ. 33

    అందుకు శిష్యులు, “ప్రభువా, ఇది ఎక్కడ జరుగుతుంది?” అని యేసును అడిగారు. అందుకు యేసు, “పీనుగు ఎక్కడ ఉంటుందో అక్కడ గద్దలు పోగవుతాయి” అని వారికి జవాబిచ్చారు.

  20. లూకా 18:1సుమారు క్రీ.శ. 33

    ఒక రోజు యేసు విసుగక ప్రార్థన చేస్తూ ఉండాలి అనే విషయాన్ని ఉపమానరీతిగా చెప్పారు:

  21. లూకా 18:2సుమారు క్రీ.శ. 33

    “ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతనికి దేవుని భయం లేదు, మనుష్యులను లెక్క చేసేవాడు కాడు.

  22. లూకా 18:3సుమారు క్రీ.శ. 33

    ఆ పట్టణంలో ఒక విధవరాలు అతని దగ్గరకు తరచుగా వస్తూ, ‘నా విరోధి విషయంలో నాకు న్యాయం తీర్చండి’ అని అడుగుతూ ఉండేది.

  23. లూకా 18:4సుమారు క్రీ.శ. 33

    “అతడు కొంతకాలం వరకు ఆమె మాటలను తిరస్కరించాడు కానీ, అతడు తనలో తాను, ‘నేను దేవునికి భయపడకపోయినా లేదా మనుష్యులను లక్ష్యపెట్టక పోయినా,

  24. లూకా 18:5సుమారు క్రీ.శ. 33

    ఈ విధవరాలు, “నాకు న్యాయం చేయండి” అని నన్ను తరచుగా తొందర పెడుతుంది, కాబట్టి ఆమె మాటిమాటికి వచ్చి నన్ను విసిగించకుండా, నేను ఆమెకు న్యాయం చేస్తాను’ అని అనుకున్నాడు.”

  25. లూకా 18:6సుమారు క్రీ.శ. 33

    కాబట్టి ప్రభువు దాని గురించి, “అన్యాయస్థుడైన న్యాయాధిపతి ఏమన్నాడో వినండి.