కంటెంట్‌కు వెళ్లండి

Menahem

8 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

Menahem ను ప్రస్తావించే వచనాలు

  1. అప్పుడు గాదీ కుమారుడైన మెనహేము తిర్సా నుండి బయలుదేరి సమరయకు వచ్చాడు. అతడు సమరయలో యాబేషు కుమారుడైన షల్లూము మీద దాడి చేసి అతన్ని చంపి అతని స్థానంలో రాజయ్యాడు.

  2. ఆ సమయంలో మెనహేము తిర్సా నుండి బయలుదేరి తిప్సహును, ఆ పట్టణంలో ఆ పరిసరాల్లో ఉన్న ప్రజలందరిపై దాడి చేశాడు, ఎందుకంటే వారు తమ తలుపులు తెరవడానికి నిరాకరించారు. అతడు తిప్సహును కొల్లగొట్టాడు, అందులో ఉన్న గర్భవతుల గర్భాలన్నిటిని చీరేశాడు.

  3. యూదా రాజైన అజర్యా పరిపాలన యొక్క ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో, గాదీ కుమారుడైన మెనహేము ఇశ్రాయేలుకు రాజయ్యాడు, అతడు సమరయలో పది సంవత్సరాలు పరిపాలించాడు.

  4. తర్వాత అష్షూరు రాజైన పూలు దేశాన్ని ఆక్రమించాడు, మెనహేము రాజ్యం మీద తన బలం నిలకడగా ఉండునట్లు, అష్షూరు రాజు సహాయం కోరుతూ అతనికి వెయ్యి తలాంతుల వెండిని ఇచ్చాడు.

  5. ఈ మొత్తం అష్షూరు రాజుకు ఇవ్వడానికి మెనహేము ఇశ్రాయేలులో ఉన్న ధనవంతులందరి దగ్గరా, యాభై షెకెళ్ళ వెండి చొప్పున వసూలు చేశాడు. కాబట్టి అష్షూరు రాజు విడిచి, ఇశ్రాయేలు దేశంలో ఇక ఉండలేదు.

  6. మెనహేము పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?

  7. మెనహేము చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, అతని తర్వాత అతని కుమారుడైన పెకహ్యా రాజయ్యాడు.

  8. యూదా రాజైన అజర్యా పరిపాలన యొక్క యాభైయవ సంవత్సరంలో, మెనహేము కుమారుడైన పెకహ్యా సమరయలో ఇశ్రాయేలుకు రాజయ్యాడు, అతడు రెండు సంవత్సరాలు పరిపాలించాడు.