Shallum గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
యాబేషు కుమారుడైన షల్లూము జెకర్యా మీద కుట్రచేసి, ప్రజలు చూస్తూ ఉండగా అతని మీద దాడి చేసి అతన్ని చంపి అతని తర్వాత రాజయ్యాడు.
యూదా రాజైన ఉజ్జియా పరిపాలన యొక్క ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో, యాబేషు కుమారుడైన షల్లూము రాజయ్యాడు, అతడు సమరయలో నెలరోజులు పరిపాలించాడు.
అప్పుడు గాదీ కుమారుడైన మెనహేము తిర్సా నుండి బయలుదేరి సమరయకు వచ్చాడు. అతడు సమరయలో యాబేషు కుమారుడైన షల్లూము మీద దాడి చేసి అతన్ని చంపి అతని స్థానంలో రాజయ్యాడు.
షల్లూము పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసిన కుట్ర గురించి, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.
యాజకుడైన హిల్కీయా, అహీకాము, అక్బోరు, షాఫాను, అశాయా హుల్దా ప్రవక్తి దగ్గరకు వెళ్లారు. ఆమె వస్త్రశాల తనిఖీదారుడైన హర్షషుకు పుట్టిన తిక్వా కుమారుడైన షల్లూము భార్య, యెరూషలేములో నూతన భాగంలో నివసించేది.
ఎల్యాశా కుమారుడు సిస్మాయీ, సిస్మాయీ కుమారుడు షల్లూము,
షల్లూము కుమారుడు యెకమ్యా, యెకమ్యా కుమారుడు ఎలీషామా.
షావూలు కుమారుడు షల్లూము, షల్లూము కుమారుడు మిబ్శాము, మిబ్శాము కుమారుడు మిష్మా.
ద్వారపాలకులు: షల్లూము, అక్కూబు, టల్మోను, అహీమాను, వారి తోటి లేవీయులు. వీరిలో షల్లూము పెద్ద.
కోరహు కుమారుడైన ఎబ్యాసాపుకు పుట్టిన కోరే కుమారుడైన షల్లూము, తన కోరహీయుల వంశంలోని తన తోటి ద్వారపాలకులు, తమ పూర్వికులు యెహోవా శిబిరానికి కావలివారిగా ఉన్నట్లుగా, వారు ఆలయద్వారాన్ని కాపలా కాసేవారు.
కోరహు వంశీయుడైన షల్లూము మొదటి కుమారుడైన మత్తిత్యా అనే లేవీయుడు నమ్మకమైనవాడు కాబట్టి అతనికి అర్పణల రొట్టెలు తయారుచేసే బాధ్యత ఇవ్వబడింది.
ఎఫ్రాయిమీయుల పెద్దలైన యెహోహనాను కుమారుడైన అజర్యా, మెషిల్లేమోతు కుమారుడైన బెరెక్యా, షల్లూము కుమారుడైన యెహిజ్కియా, హద్లాయి కుమారుడైన అమాశా అనేవారు యుద్ధం నుండి తిరిగివస్తున్న వారికి ఎదురుగా నిలబడి.
అప్పుడు హిల్కీయా, రాజు పంపినవారు హుల్దా అనే ప్రవక్తి దగ్గరకు వెళ్లారు. ఆమె షల్లూము భార్య, అతడు తోఖతు కుమారుడు, వస్త్రశాల తనిఖీదారుడైన హస్రా మనుమడు. ఆమె యెరూషలేములో నూతన భాగంలో నివసించేది. వారు ఆమెతో విషయం చెప్పారు.
ఆలయ ద్వారపాలకులు: షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబు, హటీటా, షోబయి అనేవారి వారసులు 139.
సంగీతకారుల నుండి: ఎల్యాషీబు. ద్వారపాలకుల నుండి: షల్లూము, తెలెము, ఊరి.
షల్లూము, అమర్యా, యోసేపు.
వారి ప్రక్క భాగంలో యెరూషలేములో సగభాగానికి అధిపతియైన హల్లోహేషు కుమారుడైన షల్లూము అతని కుమార్తెల సహాయంతో బాగుచేశారు.
ఆలయ ద్వారపాలకులు: షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబు, హటీటా, షోబయి అనేవారి వారసులు 138.
నీ మేనమామ షల్లూము కుమారుడైన హనామేలు నీ దగ్గరకు వచ్చి, ‘అనాతోతులో నా పొలాన్ని కొను, ఎందుకంటే ఒక సమీప బంధువుగా దాన్ని కొనడం నీ హక్కు నీ బాధ్యత’ అని చెప్తాడు.
నేను వారిని యెహోవా మందిరంలోకి, అంటే దైవజనుడైన ఇగ్దలియా కుమారుడైన హానాను కుమారుల గదిలోకి తీసుకువచ్చాను. అది అధికారుల గది ప్రక్కనే ఉన్న ద్వారపాలకుడైన షల్లూము కుమారుడైన మయశేయా గదికి పైన ఉంది.