కంటెంట్‌కు వెళ్లండి

Artaxerxes

10 వచనాలు

Artaxerxes ను ప్రస్తావించే వచనాలు

  1. ప్రవక్తయైన హగ్గయి, ఇద్దో కుమారుడైన జెకర్యాల ప్రవచనాలను బట్టి యూదుల పెద్దలు పనిని సక్రమంగా కొనసాగించారు. ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞ ప్రకారం పర్షియా రాజులైన కోరెషు, దర్యావేషు, అర్తహషస్తల ఆదేశాలను అనుసరించి వారు మందిరాన్ని కట్టడం ముగించారు.

  2. ఈ విషయాలన్ని జరిగిన తర్వాత, పర్షియా రాజైన అర్తహషస్త పరిపాలిస్తున్న కాలంలో ఎజ్రా బబులోను నుండి యెరూషలేముకు వచ్చాడు. ఎజ్రా శెరాయా కుమారుడు, అతడు అజర్యా కుమారుడు, అతడు హిల్కీయా కుమారుడు,

  3. రాజైన అర్తహషస్త పరిపాలనలో ఏడవ సంవత్సరంలో కొందరు ఇశ్రాయేలీయులు, వారితో పాటు యాజకులు, లేవీయులు, సంగీతకారులు, ద్వారపాలకులు, ఆలయ సేవకులు యెరూషలేముకు వచ్చారు.

  4. యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన శాసనాలు ఆజ్ఞల విషయంలో ధర్మశాస్త్ర శాస్త్రి, యాజకుడైన ఎజ్రాకు రాజైన అర్తహషస్త పంపిన ఉత్తరం నకలు ఇది:

  5. రాజులకు రాజైన అర్తహషస్త, యాజకుడును ఆకాశమందున్న దేవుని ధర్మశాస్త్ర బోధకుడైన ఎజ్రాకు వ్రాయునది, శుభములు.

  6. రాజునైన అర్తహషస్త అనే నేను, యూఫ్రటీసు నది అవతలి కోశాధికారులకు ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే, పరలోక దేవుని ధర్మశాస్త్ర బోధకుడు, యాజకుడైన ఎజ్రా మిమ్మల్ని ఏదైనా అడిగితే, దానిని శ్రద్ధతో మీరు అందించాలి.

  7. రాజైన అర్తహషస్త పాలనలో నాతో కూడా బబులోను నుండి వచ్చిన కుటుంబ పెద్దలు వారితో పాటు నమోదైన వారి వివరాలు:

  8. అర్తహషస్త రాజు పాలనలో ఇరవయ్యవ సంవత్సరం నీసాను నెలలో, రాజు కోసం ద్రాక్షరసం తీసుకువచ్చినప్పుడు నేను ద్రాక్షారసాన్ని తీసుకుని రాజుకు ఇచ్చాను. అంతకుముందు నేను వారి ముందు ఎప్పుడు బాధపడలేదు.

  9. నేను యూదా దేశంలో వారికి అధిపతిగా నియమించబడినప్పటి నుండి అనగా అర్తహషస్త రాజు పాలనలో ఇరవయ్యవ సంవత్సరం నుండి ముప్పై రెండవ సంవత్సరం వరకు పన్నెండు సంవత్సరాలు నేను గాని నా సోదరులు గాని అధిపతికి ఇచ్చే ఆహారాన్ని తీసుకోలేదు.

  10. అయితే ఇవన్నీ జరుగుతున్న సమయంలో నేను యెరూషలేములో లేను. ఎందుకంటే బబులోను దేశపు రాజైన అర్తహషస్త పాలన ముప్పై రెండవ సంవత్సరంలో నేను రాజు దగ్గరకు తిరిగి వెళ్లాను. కొంతకాలం తర్వాత నేను రాజు అనుమతి తీసుకుని,