కీర్తనలు 83:1-8
1
ఒక గీతము. ఆసాపు కీర్తన. ఓ దేవా! మౌనంగా ఉండకండి; ఓ దేవా, మమ్మల్ని పెడచెవిని పెట్టకండి, నిశ్చలంగా ఉండకండి.
2
మీ శత్రువులు ఎలా కేకలు వేస్తున్నారో చూడండి, మిమ్మల్ని ద్వేషించేవారు తలలు పైకెత్తుతున్నారు.
3
వారు మీ ప్రజలకు హాని చేయాలని చూస్తున్నారు; మీరు ఆదరించే వారికి వ్యతిరేకంగా వారు కుట్రలు చేస్తారు.
4
“రండి, వారి దేశాన్ని లేకుండ నాశనం చేద్దాం అప్పుడు ఇశ్రాయేలీయుల పేరు ఇక జ్ఞాపకం ఉండదు” అని వారు అంటున్నారు.
5
వారు ఏకమనస్సుతో కుట్ర చేశారు; వారు మీకు వ్యతిరేకంగా ఒప్పందం చేసుకున్నారు.
6
గుడారాల్లో నివసించే ఎదోమీయులు, ఇష్మాయేలీయులు, మోయాబీయులు, హగ్రీయీలు,
7
గెబాలు, అమ్మోను అమాలేకు, ఫిలిష్తియా, తూరు ప్రజలతో ఒప్పందం చేసుకున్నారు.
8
లోతు వారసులను బలోపేతం చేయడానికి అష్షూరు కూడా వారితో చేరింది. సెలా
Settings