Skip to content
కీర్తనలు 44:9-15

కీర్తనలు 44:9-15

9
కాని ఇప్పుడైతే మీరు మమ్మల్ని త్రోసివేసి అవమానపరిచారు; మా సైన్యంతో మీరు రావడం లేదు.
10
శత్రువుల ముందు పారిపోవలసి వచ్చింది, పగవారు మమ్మల్ని దోచుకున్నారు.
11
గొర్రెలను ఆహారంగా ఇచ్చినట్లు మమ్మల్ని వారికిచ్చారు దేశాల మధ్యకు మమ్మల్ని చెదరగొట్టారు.
12
లాభం చూసుకోకుండా నీ ప్రజలను, తక్కువ వెలకు అమ్మేశారు.
13
పొరుగువారు మమ్మల్ని నిందించేలా చేశారు; మా చుట్టూ ఉన్నవారు మమ్మల్ని ఎగతాళి చేసేలా చేశారు.
14
మమ్మల్ని జనాల నోట సామెతలా చేశారు; జనాంగాలు తలలూపుతూ మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు.
15
నిందిస్తూ హేళన చేసేవారి కారణంగా పగ తీర్చుకోవాలనుకునే శత్రువుల కారణంగా శత్రువులు మా ఎదుటకు వస్తే, దినమంతా మాకు అవమానమే; సిగ్గు మా ముఖాన్ని కమ్మివేసింది.

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.