Перейти к содержимому
ఓబద్యా 1:1-8

ఓబద్యా 1:1-8

1
ఓబద్యాకు వచ్చిన దర్శనం. ప్రభువైన యెహోవా ఎదోము గురించి ఇలా చెప్తున్నారు: మేము యెహోవా నుండి ఒక సందేశం వచ్చింది, “లెండి! ఎదోము మీద యుద్ధానికి వెళ్దాం” అని చెప్పడానికి దేశాలకు ఒక దూత పంపబడ్డాడు.
2
“చూడు, నేను నిన్ను దేశాల్లో అల్పమైన దానిగా చేస్తాను; నీవు పూర్తిగా తృణీకరించబడతావు.
3
నీ హృదయ గర్వం నిన్ను మోసం చేసింది, బండ సందుల్లో నివసించేదానా, కొండ శిఖరాల మీద నివాసం ఏర్పరచుకున్నదానా, ‘నన్ను ఎవరు క్రిందకు పడవేయగలరు?’ అని నీలో నీవనుకుంటావు.
4
నీవు గ్రద్దలా పైకి ఎగిరి, నక్షత్రాలలో నీ గూడు కట్టుకున్నా, అక్కడినుండి నేను నిన్ను క్రిందికి పడవేస్తాను” అని యెహోవా చెప్తున్నారు.
5
“ఒకవేళ నీ మీదికి దొంగలు వస్తే, రాత్రివేళ దొంగలు వస్తే ఎంతగా నాశనం చేస్తారో కదా! వారికి కావలసినంత వారు దోచుకుంటారు కదా? ద్రాక్షలు పోగుచేసుకునేవారు నీ దగ్గరకు వస్తే, వారు కొన్ని ద్రాక్షలు వదిలిపెడతారు కదా?
6
ఏశావు సంతతివారిని పూర్తిగా దోచుకుంటారు, వారు దాచిన నిధులన్నిటిని దోచుకుంటారు!
7
నీతో సంధి చేసుకున్న వారు నిన్ను తమ సరిహద్దు వరకు తరిమివేస్తారు; నీ స్నేహితులు నిన్ను మోసం చేసి నీ మీద గెలుస్తారు; నీ ఆహారం తిన్నవారు నీకోసం ఉచ్చు పెడతారు, నీవు దానిని తెలుసుకోలేవు.
8
“ఆ రోజున, యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, నేను ఎదోము జ్ఞానులను, ఏశావు పర్వతాల్లో వివేకులను నాశనం చేయనా?
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options