Skip to content
యోబు 6:1-13

యోబు 6:1-13

1
అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు:
2
“కేవలం నా వేదనను తూకం వేసి, నా కష్టాలన్నీ త్రాసులో ఉంచి లెక్కిస్తే,
3
సముద్రాల ఇసుక కంటే అవి బరువుగా ఉంటాయి, కాబట్టి నా మాటలు ఉద్వేగభరితంగా ఉండడంలో ఆశ్చర్యం లేదు.
4
సర్వశక్తిమంతుడైన దేవుని బాణాలు నాకు గుచ్చుకున్నాయి, నా ఆత్మ వాటికున్న విషం త్రాగింది; దేవుని భయంకరకార్యాలు నాకు వ్యతిరేకంగా మోహరించి ఉన్నాయి.
5
గడ్డి దొరికితే అడవి గాడిద అరుస్తుందా, మేత దొరికితే ఎద్దు రంకెవేస్తుందా?
6
ఉప్పు లేకుండ రుచిలేని ఆహారం ఎవరైనా తింటారా? గుడ్డులోని తెలుపుకు రుచి ఉంటుందా?
7
నేను దాన్ని తాకను, అలాంటి ఆహారం తింటే నా ఆరోగ్యం పాడవుతుంది.
8
“నా అభ్యర్థన నెరవేరి, దేవుడే నా కోరికను అనుగ్రహించియుంటే బాగుండేది,
9
దేవుడు ఇష్టపూర్వకంగా నన్ను నలిపివేసి, తన చేయి జాడించి నా ప్రాణాన్ని తీసివేస్తే బాగుండేది!
10
అప్పుడు నేను ఈ ఆదరణ కలిగి ఉంటాను, భరించలేని బాధలో ఉన్నప్పటికీ, పరిశుద్ధుని మాటలు నేను తిరస్కరించలేదని ఆనందిస్తాను.
11
“నేను ఇంకా నిరీక్షణ కలిగి ఉండడానికి నాకున్న బలమెంత? నేను ఓపికగా ఉండడానికి నా అంతం ఏపాటిది?
12
రాయికున్నంత బలం నాకుందా? నాదేమైనా ఇత్తడి శరీరమా?
13
నాకు నేను సహాయం చేసుకోగల శక్తి నాలో ఏమైన ఉన్నదా? నా శక్తి నన్ను పూర్తిగా విడిచిపెట్టింది.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options