Skip to content
యోబు 5:17-27

యోబు 5:17-27

17
“దేవుడు సరిదిద్దేవారు ధన్యులు; కాబట్టి సర్వశక్తిమంతుని క్రమశిక్షణను నిర్లక్ష్యం చేయకు.
18
గాయం చేసేది ఆయనే, గాయాన్ని కట్టేది కూడా ఆయనే; ఆయన గాయపరుస్తారు, కాని ఆయన చేతులే స్వస్థపరుస్తాయి.
19
ఆరు ఆపదల్లో నుండి ఆయన నిన్ను విడిపిస్తారు; ఏడు బాధల్లో ఏ హాని నిన్ను తాకదు.
20
కరువు కాలంలో చావు నుండి, యుద్ధంలో ఖడ్గం అంచు నుండి ఆయన నిన్ను తప్పిస్తారు.
21
కొరడాలవంటి నోటిమాటల నుండి నిన్ను కాపాడతారు, నాశనం వచ్చినా నీవు భయపడవు.
22
కరువు నాశనం వచ్చినప్పుడు నీవు నవ్వుతావు, అడవి మృగాలకు నీవు భయపడే అవసరం లేదు.
23
ఎందుకంటే పొలం లోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుంటావు, అడవి జంతువులు నీతో సమాధానంగా ఉంటాయి.
24
నీ గుడారం క్షేమనివాసమని నీవు తెలుసుకుంటావు; నీ ఆస్తులను లెక్క చూడగా వాటిలో ఒకటి కూడా పోదు.
25
నీకు చాలామంది పిల్లలు ఉంటారని, నీ సంతానం భూమిమీది గడ్డిని పోలి ఉంటుందని నీవు తెలుసుకుంటావు.
26
పంట కాలంలో ధాన్యం సేకరించబడినట్లు పూర్తి వయస్సు నిండిన తర్వాత నీవు సమాధికి చేరతావు.
27
“మేము ఇది పరిశీలించాము, ఇది నిజము. కాబట్టి ఈ మాటలు విని నీ మంచి కోసం తెలుసుకో.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options