యోబు 5:8-16
8
“ఒకవేళ నేనే నువ్వైతే, నేను దేవునికే మొరపెడతాను; ఆయన ఎదుట నా వాదన చెప్పుకుంటాను.
9
పరిశోధించలేని మహాకార్యాలను లెక్కించలేని అద్భుత క్రియలను ఆయన చేస్తారు.
10
ఆయన భూమిపై వాన కురిపిస్తారు; పొలాలకు నీటిని పంపిస్తారు.
11
ఆయన దీనావస్థలోనున్న వారిని పైకి లేపుతారు, దుఃఖపడేవారిని క్షేమానికి లేవనెత్తుతారు.
12
వంచకుల చేతులు విజయం సాధించకుండ, ఆయన వారి ఆలోచనలను తలక్రిందులు చేస్తారు.
13
జ్ఞానులను వారి యుక్తిలోనే ఆయన పట్టుకుంటారు, వంచకుల ఆలోచనలు తుడిచివేయబడతాయి.
14
పగటివేళ వారి మీదికి చీకటి వస్తుంది; రాత్రిలో తడుముకున్నట్లు వారు మధ్యాహ్న వేళలో తడుముకుంటారు.
15
వారి నోటి నుండి వచ్చే పదునైన మాటల నుండి ఆయన బీదలను రక్షిస్తారు; బలవంతుల చేతిలో నుండి ఆయన వారిని రక్షిస్తారు.
16
కాబట్టి బీదలకు నిరీక్షణ ఉంది, అన్యాయం తన నోరు మూసుకుంటుంది.
Settings