Skip to content
అపొస్తలుల కార్యములు 15:22-35

అపొస్తలుల లేఖ పంపబడుట

అపొస్తలుల కార్యములు 15:22-35
22
ఆ తర్వాత అపొస్తలులు సంఘపెద్దలు సంఘమంతటితో కలిసి, పౌలు బర్నబాలతో పాటు ఇంకొందరు విశ్వాసులను అంతియొకయ ప్రాంతానికి పంపాలని నిర్ణయించి విశ్వాసుల మధ్యలో నాయకులుగా ఉన్న బర్సబ్బా అని పిలువబడే యూదా సీలను ఏర్పరచుకున్నారు.
23
వారితో ఈ ఉత్తరాన్ని పంపించారు: అపొస్తలులు, మీ సహోదరులైన సంఘపెద్దలు, అంతియొకయలోను, సిరియాలోను, కిలికియ ప్రాంతాల్లో నివసించే యూదేతరులలోని విశ్వాసులకు, శుభములు.
24
మా నుండి అనుమతి పొందకుండానే మాలో నుండి కొందరు మీ దగ్గరకు వచ్చి వారు మీతో చెప్పే బోధలతో మిమ్మల్ని కలవరపరుస్తూ, మీ మనస్సులను ఇబ్బంది పెడుతున్నారని మేము విన్నాము.
25
కాబట్టి మా నుండి కొంతమందిని ఏర్పరచుకొని మా ప్రియ స్నేహితులైన బర్నబా పౌలుతో వారిని పంపడానికి మేము అందరం అంగీకరించాము.
26
మేము పంపించే ఈ ప్రియ స్నేహితులు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట తమ ప్రాణాలను కూడా లెక్కచేయని వారు.
27
మేము వ్రాసిన దానిని నోటి మాటలతో దృఢపరచడానికి యూదాను సీలను పంపిస్తున్నాము.
28
వీటి కంటే మీమీద ఎక్కువ భారం మోపకూడదని పరిశుద్ధాత్మకు, మాకు అనిపించిన విషయాలు ఏమనగా:
29
విగ్రహాలకు అర్పించిన ఆహారాన్ని తినడం, రక్తం తినడం, గొంతును నులిమి చంపిన జంతువుల మాంసం తినడం, లైంగిక అనైతికత సంబంధాలను మానుకోవాలి. వీటికి దూరంగా ఉండి జాగ్రత్త పడితే మీకు మేలు కలుగుతుంది. మీకు క్షేమం కలుగును గాక.
30
వారు పంపబడిన తర్వాత వారు అక్కడినుండి బయలుదేరి అంతియొకయ పట్టణానికి వచ్చి, అక్కడ సంఘమంతటిని ఒక్క చోటికి చేర్చి ఈ ఉత్తరాన్ని వారికి అందించారు.
31
వారు ఆ ఉత్తరాన్ని చదివి, దానిలోని ప్రోత్సాహపరిచే సందేశాన్ని బట్టి ఎంతో సంతోషించారు.
32
యూదా, సీలలు కూడా ప్రవక్తలు కాబట్టి వారు కూడా విశ్వాసులను ప్రోత్సహించి వారిని విశ్వాసంలో బలపరిచారు.
33
అక్కడ వారు కొంతకాలం గడిపిన తర్వాత తమను పంపిన వారి దగ్గరకు తిరిగి వెళ్లడానికి విశ్వాసులచే సమాధానంతో పంపబడ్డారు.
34
అయితే సీల అక్కడే ఉండాలని నిర్ణయించుకొన్నాడు.
35
కానీ పౌలు బర్నబాలు అంతియొకయలోనే ఉండి, ఇంకా అనేకులతో కలిసి ప్రభువు సందేశాన్ని బోధిస్తూ ప్రకటించారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options