1 రాజులు 6:1-10
1
ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన నాలుగు వందల ఎనభై సంవత్సరాల తర్వాత, సొలొమోను ఇశ్రాయేలును పరిపాలిస్తున్న నాలుగవ సంవత్సరం, జీప్ అనే రెండవ నెలలో, సొలొమోను యెహోవా మందిరాన్ని కట్టడం ప్రారంభించాడు.
2
రాజైన సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరం పొడవు అరవై మూరలు, వెడల్పు ఇరవై మూరలు, ఎత్తు ముప్పై మూరలు.
3
మందిరంలో విశాల గది ముందు మంటపం ఉంది, మందిరం యొక్క వెడల్పును బట్టి దాని పొడవు ఇరవై మూరలు, మందిరం ముందుకు పది మూరల వెడల్పు.
4
అతడు మందిర గోడలలో పై భాగంలో ఇరుకైన కిటికీలు చేయించాడు.
5
ఆలయ విశాల గది గర్భాలయం యొక్క గోడల చుట్టూరా ప్రక్క గదులు కట్టించాడు.
6
క్రింది అంతస్తు వెడల్పు అయిదు మూరలు, రెండవ అంతస్తు గదుల వెడల్పు ఆరు మూరలు, మూడవ అంతస్తు గదుల వెడల్పు ఏడు మూరలు. గదుల దూలాలు మందిర గోడల్లోకి చొచ్చుకుపోకుండా, మందిర బయటి గోడలకు చిమ్మురాళ్లు పెట్టించాడు.
7
మందిరం కట్టడానికి ముందుగానే చెక్కిన రాళ్లు వాడారు, అది కడుతున్నప్పుడు సుత్తి, గొడ్డలి, మరి ఏ ఇతర ఇనుప పనిముట్ల శబ్దం వినబడలేదు.
8
క్రింది అంతస్తు గుమ్మం మందిరానికి దక్షిణ వైపున ఉంది; రెండవ అంతస్తుకు, అక్కడినుండి మూడవ అంతస్తుకు ఎక్కడానికి మెట్లు ఉన్నాయి.
9
అతడు మందిరం కట్టించి దూలాలు, దేవదారు పలకలతో కప్పు వేయించి పూర్తి చేశాడు.
10
అతడు మందిరం చుట్టూ గదులు కట్టించాడు. వీటి ఎత్తు అయిదు మూరలు, అవి మందిరానికి దేవదారు దూలాలతో జత చేయబడ్డాయి.
Settings