Skip to content
1 దినవృత్తాంతములు 13:5-14

1 దినవృత్తాంతములు 13:5-14

5
కాబట్టి దావీదు దేవుని మందసాన్ని కిర్యత్-యారీము నుండి తీసుకురావడానికి ఈజిప్టులో ఉన్న షీహోరు నది నుండి లెబో హమాతు వరకు ఉన్న ఇశ్రాయేలీయులందరిని సమకూర్చాడు.
6
కెరూబుల మధ్య ఆసీనుడైన దేవుడు అని పిలువబడే యెహోవా దేవుని మందసాన్ని తీసుకురావడానికి దావీదు, ఇశ్రాయేలీయులందరు యూదాలోని కిర్యత్-యారీము అని పిలువబడే బాలాకు వెళ్లారు.
7
వారు దేవుని మందసాన్ని క్రొత్త బండిమీద ఎక్కించి అబీనాదాబు ఇంటి నుండి బయలుదేరారు, ఉజ్జా, అహియోలు ఆ బండిని తోలారు.
8
దావీదు, ఇశ్రాయేలీయులందరు పాటలు పాడుతూ, సితారలు, వీణలు, తంబురలు, తాళాలు, బూరలు వాయిస్తూ తమ శక్తి అంతటితో దేవుని ఎదుట ఉత్సహిస్తూ ఉన్నారు.
9
వారు కీదోను నూర్పిడి కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు, ఎడ్లు తడబడినందుకు దేవుని మందసాన్ని పట్టుకోడానికి ఉజ్జా చేయి చాపాడు.
10
ఉజ్జా మందసం మీద చేయి వేసినందుకు యెహోవా కోపం అతని మీద రగులుకుని ఆయన అతన్ని మొత్తగా అతడు అక్కడే దేవుని ఎదుట చనిపోయాడు.
11
యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకున్నందుకు దావీదుకు కోపం వచ్చింది కాబట్టి ఆ స్థలానికి పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టాడు. ఈ రోజు వరకు దానికి అదే పేరు.
12
ఆ రోజు దావీదు దేవునికి భయపడి, “దేవుని మందసాన్ని నా దగ్గరకు ఎలా తెచ్చుకోవాలి?” అని అడిగాడు.
13
దేవుని మందసాన్ని తన దగ్గర పెట్టుకోడానికి దావీదు పట్టణానికి తీసుకెళ్లకుండా, అతడు దాన్ని గిత్తీయుడైన ఓబేద్-ఎదోము ఇంటికి తీసుకెళ్లాడు.
14
దేవుని మందసం ఓబేద్-ఎదోము ఇంట్లో అతని కుటుంబం దగ్గర మూడు నెలలు ఉంది. యెహోవా అతన్ని, అతని ఇంటివారిని అతనికి కలిగిన సమస్తాన్ని దీవించారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options