జెకర్యా2
Listen to this chapter
0:00
0:00
కొలత త్రాడు దర్శనం
1
ఆ తర్వాత నేను పైకి చూసినప్పుడు నా ఎదుట కొలమానం పట్టుకున్న వ్యక్తి కనబడ్డాడు.
2
“నీవు ఎక్కడికి వెళ్తున్నావు?” అని నేను అడిగాను. అందుకతడు, “యెరూషలేము పొడవు, వెడల్పు ఎంత ఉందో కొలిచి తెలుసుకోవడానికి వెళ్తున్నాను” అన్నాడు.
3
అప్పుడు నాతో మాట్లాడుతున్న దూత వెళ్లిపోతుండగా, మరొక దూత అతన్ని కలుసుకోడానికి వచ్చి,
4
అతనితో ఇలా అన్నాడు: “నీవు ఆ యువకుని దగ్గరికి పరుగెత్తుకొని వెళ్లి ఇలా చెప్పు, ‘యెరూషలేములో మనుష్యులు పశువులు విస్తారంగా ఉన్నందుకు, అది గోడలులేని పట్టణంలా ఉంటుంది.
5
నేనే దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను, దాని మధ్యలో నివసించి దానికి ఘనతగా ఉంటాను’ అని యెహోవా చెప్తున్నారు.
బబులోను నుండి పారిపోవాలని చెరలోనున్నవారికి పిలుపు
6
“రండి! ఉత్తర దేశం నుండి తప్పించుకుని రండి, ఆకాశం నాలుగు దిక్కులకు వీచే గాలిలా నేను మిమ్మల్ని చెదరగొట్టాను” అని యెహోవా చెప్తున్నారు.
7
“సీయోను ప్రజలారా, రండి! బబులోను దేశంలో నివసిస్తున్న మీరు తప్పించుకుని రండి!”
8
సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “మిమ్మల్ని ముట్టుకున్న వారు యెహోవా కనుగుడ్డును ముట్టినట్లే అని తలంచి తనకు ఘనత కలిగేలా మహిమాన్వితుడు మిమ్మల్ని దోచుకున్న దేశాల మీదికి నన్ను పంపించారు.
9
నేను వారి మీద నా చేయి ఎత్తుతాను అప్పుడు వారి బానిసలు వారిని దోచుకుంటారు. అప్పుడు సైన్యాల యెహోవా నన్ను పంపారని మీరు తెలుసుకుంటారు.
దేవుడు యెరూషలేములో నివసించును
10
“సీయోను కుమార్తె, కేకవేయి, సంతోషించు. నేను వస్తున్నాను, మీ మధ్య నివసిస్తాను” అని యెహోవా చెప్తున్నారు.
11
“ఆ రోజున అనేక దేశాలు యెహోవా దగ్గరకు చేరి నా ప్రజలవుతారు. నేను మీ మధ్య నివసిస్తాను, అప్పుడు సైన్యాల యెహోవా నన్ను పంపారని మీరు తెలుసుకుంటారు.
12
పరిశుద్ధ దేశంలో యెహోవా యూదాను తన స్వాస్థ్యంగా సొంతం చేసుకుంటారు, యెరూషలేమును మళ్ళీ ఎన్నుకుంటారు.
13
సర్వజనులారా, యెహోవా తన పరిశుద్ధ నివాసం విడిచి వస్తున్నారు కాబట్టి ఆయన ఎదుట మౌనంగా ఉండండి.”
Use ← → arrow keys to navigate
Settings
Reading Style
Typeface
Font Size px
Reading Width chars
Options
Study Note