- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
2 సమూయేలు9
Listen to this chapter
0:00
0:00
సౌలు సంతానాన్ని దావీదు వెదకుట
1
ఒకసారి దావీదు, “యోనాతాను బట్టి నేను దయ చూపించడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా?” అని అడిగాడు.
2
సౌలు కుటుంబానికి సీబా అనే సేవకుడు ఉండేవాడు. వారు అతన్ని పిలిపించి దావీదు ఎదుట నిలబెట్టినప్పుడు రాజు అతన్ని, “నీవు సీబావా?” అని అడిగాడు. అందుకు వాడు, “అవును, రాజా” అన్నాడు.
3
అప్పుడు రాజు, “దేవుడు నాకు దయచూపించినట్లుగా నేను దయచూపడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా?” అని అడిగాడు. అందుకు సీబా రాజుతో, “యోనాతానుకు ఒక కుమారుడు ఉన్నాడు; అతని రెండు కాళ్లు కుంటివి” అని చెప్పాడు.
4
“అతడెక్కడ ఉన్నాడు?” అని రాజు అడిగాడు. అందుకు సీబా, “అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడైన మాకీరు ఇంట్లో ఉన్నాడు” అని చెప్పాడు.
5
అప్పుడు రాజైన దావీదు మనుష్యులను పంపించి లోదెబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడైన మాకీరు ఇంటి నుండి అతన్ని రప్పించాడు.
దావీదు నిబంధనా కృప చూపుట
6
సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు దగ్గరకు వచ్చి అతని ఎదుట తల నేలకు వంచి నమస్కరించాడు. దావీదు, “మెఫీబోషెతూ!” అని పిలిచాడు. అతడు, “నేను నీ సేవకుడిని” అని సమాధానం ఇచ్చాడు.
7
దావీదు అతనితో, “భయపడకు, నీ తండ్రి యోనాతాను బట్టి నేను నీ మీద దయ చూపిస్తాను. నీ తాత సౌలుకు చెందిన భూమంతటిని నీకు మరలా ఇప్పిస్తాను, నీవు ఎప్పటికీ నా బల్ల దగ్గరే భోజనం చేస్తావు” అన్నాడు.
8
అప్పుడు మెఫీబోషెతు నమస్కారం చేసి, “చచ్చిన కుక్కలాంటి నా పట్ల నీవు దయ చూపడానికి నీ సేవకుడనైన నేను ఎంతటివాన్ని?” అన్నాడు.
భూమి పునరుద్ధరణ మరియు సీబా నియామకం
9
అప్పుడు రాజైన దావీదు సౌలు సహాయకుడైన సీబాను పిలిపించి, “సౌలుకు అతని కుటుంబానికి చెందిన సమస్తాన్ని నీ యజమాని మనుమడికి ఇప్పించాను.
10
నీవు, నీ కుమారులు నీ పనివారు అతని కోసం ఆ భూమిని సాగుచేసి నీ యాజమాని మనుమడికి కావలసిన ఆహారాన్ని ఆ పంట నుండి తీసుకురావాలి. కాని నీ యాజమాని మనుమడైన మెఫీబోషెతు ఎప్పుడూ నా బల్ల దగ్గరే భోజనం చేస్తాడు” అని చెప్పాడు. (సీబాకు పదిహేను మంది కుమారులు, ఇరవైమంది పనివారున్నారు.)
11
అప్పుడు సీబా, “నా ప్రభువైన రాజు తన సేవకుడనైన నాకు చేయమని ఆజ్ఞాపించిన దాన్నంతా చేస్తాను” అన్నాడు. అప్పటినుండి మెఫీబోషెతు ఒక రాకుమారునిలా రాజు బల్ల దగ్గర భోజనం చేస్తూ వచ్చాడు.
12
మెఫీబోషెతుకు చిన్నకుమారుడు ఉన్నాడు. అతని పేరు మీకా. సీబా ఇంట్లో ఉన్నవారందరు మెఫీబోషెతుకు సేవకులు.
13
మెఫీబోషెతు యెరూషలేములో నివసించి నిత్యం రాజు బల్ల దగ్గర భోజనం చేస్తూ ఉన్నాడు. అతని రెండు కాళ్లు కుంటివి.
Use ← → arrow keys to navigate
Settings
Reading Style
Typeface
Font Size px
Reading Width chars
Options
Study Note