కంటెంట్‌కు వెళ్లండి

Zeresh గురించి బైబిల్ వచనాలు: Wife of Haman.

6 వచనాలు · 1 కోణం

Wife of Haman. గురించి వచనాలు

  1. అయినా హామాను తనను తాను నిగ్రహించుకొని ఇంటికి వెళ్లాడు. తన స్నేహితులను, తన భార్యయైన జెరెషును పిలిచి,

  2. హామాను గర్వంగా తనకున్న విస్తారమైన ఐశ్వర్యం గురించి, తనకున్న ఎంతోమంది కుమారుల గురించి, రాజు తనను ఎన్ని విధాలుగా ఘనపరిచాడో, ఎలా తనను ఇతర సంస్థానాధిపతుల ఎదుట గౌరవించాడో వారికి గొప్పగా చెప్పుకున్నాడు.

  3. హామాను ఇంకా మాట్లాడుతూ, “అంతేకాదు, ఎస్తేరు రాణి, తాను ఇస్తున్న విందుకు రాజుతో పాటు రమ్మని నన్ను మాత్రమే పిలిచింది. రేపు విందుకు రాజుతో రమ్మని నన్ను ఆహ్వానించింది.

  4. అయితే, రాజ ద్వారం దగ్గర కూర్చున్న యూదుడైన మొర్దెకైను చూసినంత కాలం ఇదంతా నాకు సంతృప్తినివ్వదు” అని అన్నాడు.

  5. అతని భార్య జెరెషు, అతని స్నేహితులందరు, “యాభై మూరల ఎత్తుగల ఉరికంబం చేయించు. రేపు ఉదయం మొర్దెకైను దాని మీద ఉరి తీయమని రాజుకు చెప్పు. తర్వాత రాజుతో పాటు విందుకు వెళ్లి ఆనందించు” అని అతనికి చెప్పారు. ఈ సలహా హామానుకు నచ్చింది, కాబట్టి అతడు ఉరికంబం చేయించాడు.

  6. హామాను తనకు జరిగిందంతా తన భార్య జెరషుకు, తన స్నేహితులందరికి తెలియజేశాడు. అతని సలహాదారులు, అతని భార్య జెరెషు అతనితో అన్నారు, “ఎవరి ఎదుట నీ పతనం ప్రారంభమైందో, ఆ మొర్దెకై యూదుడు కాబట్టి, అతని ఎదుట నీవు నిలబడలేవు, నీవు ఖచ్చితంగా పడిపోతావు.”