Skip to content

Uncleanness గురించి బైబిల్ వచనాలు

38 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. సూర్యుడు అస్తమించినప్పుడు వారు పవిత్రం అవుతారు, తర్వాత వారు పవిత్ర అర్పణలు తినవచ్చు, ఎందుకంటే అది వారి ఆహారము.

  2. వారు చచ్చినదానిని గాని అడవి జంతువులు చీల్చిన దానిని గాని తిని అపవిత్రం కాకూడదు. నేను యెహోవాను.

  3. “ఎవరికైనా అపవిత్రమైన కుష్ఠువ్యాధి ఉన్నా లేదా ఏదైనా స్రావము కలిగి ఉన్నా లేదా శవాన్ని ముట్టుకొని ఆచారరీత్య అపవిత్రమై ఉన్నా, అలాంటి వారిని శిబిరంలో నుండి పంపివేయాలని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించు.

  4. పురుషులనైనా స్త్రీలనైనా పంపివేయాలి; నేను ప్రజలమధ్య నివసిస్తాను కాబట్టి వారు శిబిరాన్ని అపవిత్రం చేయకుండేలా వారిని పంపివేయాలి.”

  5. అయితే కొందరు మనుష్యులు మృతదేహాన్ని బట్టి ఆచారరీత్య అపవిత్రులైనందుకు ఆ రోజున పస్కాను జరుపుకోలేకపోయారు. కాబట్టి అదే రోజు వారు మోషే అహరోనుల దగ్గరకు వచ్చి,

  6. వారు మోషేతో, “ఒక మనుష్యుని మృతదేహాన్ని బట్టి మేము అపవిత్రులం అయ్యాము, అయితే యెహోవా అర్పణను ఇతర ఇశ్రాయేలీయులతో పాటు నిర్ణీత సమయంలో మేము ఎందుకు సమర్పించకూడదు?” అని అడిగారు.

  7. అందుకు మోషే వారితో, “మీ గురించి యెహోవా ఏమి ఆజ్ఞాపిస్తారో తెలుసుకునే వరకు ఆగండి” అని జవాబిచ్చాడు.

  8. అప్పుడు యెహోవా మోషేతో,

  9. “ఇశ్రాయేలీయులతో చెప్పు: ‘ఇప్పుడున్న మీలో ఎవరైనా లేదా రాబోయే తరాల వారైనా మృతదేహాన్ని బట్టి గాని దూర ప్రయాణాన్ని బట్టి గాని అపవిత్రులైతే, వారు యెహోవా పస్కాను జరుపుకోవచ్చు,

  10. అయితే వారు రెండవ నెల పద్నాలుగవ రోజు సాయంకాలం జరుపుకోవాలి. వారు పులియని రొట్టెలతో, చేదు కూరలతో పాటు గొర్రెపిల్లను తినాలి.

  11. “ఎవరైనా ఎవరినైన చంపినా, లేదా చంపబడిన వారిని తాకినా, తాకినవారు ఏడు రోజులు శిబిరం బయట ఉండాలి. మూడవ రోజున ఏడవ రోజున మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి, మీ బందీలను కూడా శుద్ధి చేయాలి.

  12. రాత్రి జరిగినదాని వల్ల అపవిత్రమైన వ్యక్తి, శిబిరం బయటకు వెళ్లి అక్కడ ఉండాలి.

  13. కానీ సాయంకాలం అవుతుండగా అతడు స్నానం చేసుకోవాలి, సూర్యాస్తమయం అయినప్పుడు అతడు శిబిరానికి తిరిగి రావచ్చు.