కంటెంట్‌కు వెళ్లండి

Tribute గురించి బైబిల్ వచనాలు: Exacted from all conquered nations

6 వచనాలు · 24 కోణాలు

"Tribute" కోసం వెతకండి

Exacted from all conquered nations గురించి వచనాలు

  1. గెజెరులో నివసిస్తున్న కనానీయులను వారు వెళ్లగొట్టలేదు; ఈ రోజు వరకు కనానీయులు ఎఫ్రాయిం ప్రజలమధ్య నివసిస్తూ దాసులుగా కష్టపడి పని చేస్తున్నారు.

  2. జెబూలూను గోత్రం వారు కూడా కిత్రోను నహలోలులో ఉన్న కనానీయులను వెళ్లగొట్టలేదు, కాబట్టి కనానీయులు వారి మధ్యలోనే నివసించారు. అయితే జెబూలూనీయులు వారితో వెట్టిపనులు చేయించారు.

  3. నఫ్తాలి గోత్రం వారు కూడా బేత్-షెమెషును బేత్-అనాతులో ఉన్నవారిని వెళ్లగొట్టలేదు; నఫ్తాలీయులు కూడా కనానీయ నివాసుల మధ్యలో నివసించారు, బేత్-షెమెషులో, బేత్-అనాతులో ఉన్నవారు వారికి వెట్టిపనులు చేశారు.

  4. అమోరీయులు హెరెసు పర్వతంలో, అయ్యాలోనులో, షయల్బీములో నివసించడానికి నిశ్చయించుకున్నారు, కానీ యోసేపు గోత్రాల బలం ఎక్కువైనప్పుడు, వారు అమోరీయులతో వెట్టిపనులు చేయించుకొన్నారు.

  5. అతడు యెరూషలేములో పరిపాలించకుండా ఫరో నెకో అతన్ని హమాతు ప్రదేశంలో ఉన్న రిబ్లాలో ఖైదీగా చేశాడు, యూదా మీద వంద తలాంతుల వెండిని, ఒక తలాంతు బంగారాన్ని పన్నుగా విధించాడు.

  6. ఫరో నెకో నిర్ణయించిన ఆ వెండి బంగారాలు యెహోయాకీము అతనికి ఇచ్చాడు. అలా చేయడానికి దేశం మీద పన్ను నిర్ణయించి దేశ ప్రజల నుండి వెండి బంగారాలు వసూలు చేయించాడు.